Hardik Pandya shocking look: ఆసియా కప్ లో భాగంగా ఇటీవల టీమిండియా యూఏఈ వెళ్లిపోయింది. అక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆటగాళ్లు శిక్షణలో మునిగి ఉండగా.. ఒక ఆటగాడు తెల్లటి జుట్టుతో మైదానం లోకి వచ్చాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లు అతడిని చూసి షాక్ అయ్యారు. ఎవరితడు కొత్తగా జట్టులోకి వచ్చాడా? ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు కదా? జట్టు పేర్లలో ఇతడిలా ఎవరూ లేరు కదా? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. దీంతో జాతీయ మీడియాలో ఈ అంశానికి సంబంధించి కథనాలు కూడా ప్రసారమయ్యాయి. అయితే ఆ ఫోటోగ్రాఫర్లు దగ్గరికి వెళ్లి చూస్తే గాని తెలియలేదు అతడు హార్దిక్ పాండ్యా అని.
హార్థిక్ పాండ్యా అద్భుతమైన ఆల్ రౌండర్ మాత్రమే కాదు.. అంతకుమించిన ఫ్యాషన్ ఐకాన్ కూడా. అప్పట్లో ధోని తన హెయిర్ స్టైల్ ను రకరకాలుగా ప్రదర్శించేవాడు. కొన్ని సందర్భాలలో జులపాలు.. ఇంకొన్ని సందర్భాలలో గుండు.. మరికొన్ని సందర్భాలలో షార్ట్ హెయిర్ కట్ తో దర్శనమిచ్చేవాడు. ఎలా ఉన్నప్పటికీ ధోని అదరగొట్టేవాడు. ధోని హెయిర్ స్టైల్ కు ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని సరికొత్త హెయిర్ స్టైల్ తో కనిపించాడు. అది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ధోని హెయిర్ స్టైల్ ను మర్చిపోకముందే హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంతేకాదు సరికొత్త కలర్ హెయిర్ తో అతడు కనిపించాడు.
పూర్తిగా తెలుపు రంగులోకి
పాశ్చాత్య దేశాల ఆటగాళ్లు తెలుపు లేదా ఎరుపు వర్ణం జుట్టుతో కనిపిస్తుంటారు. అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది కాబట్టి వారి జట్టు కూడా అదే విధంగా ఉంటుంది. కానీ ఆసియాలో ముఖ్యంగా మన దేశంలో అరుదుగా తప్పిస్తే చాలామందికి నల్లని రంగు ఉన్న జుట్టు ఉంటుంది. అయితే ఈ జుట్టు మీద విరక్తి కలిగిందో.. జస్ట్ ఫర్ ఏ చేంజ్ అనిపించిందో తెలియదు కానీ హార్దిక్ పాండ్యా తన నల్లటి జుట్టును మొత్తం తెల్లగా మార్చుకున్నాడు. పూర్తిగా వైట్ హెయిర్ స్టైల్ లోకి వచ్చేసాడు. ఆసియా కప్ లో తెల్లటి హెయిర్ స్టైల్ తో కనిపించాడు. ఇప్పుడు అతడు తెలుపు రంగు హెయిర్ స్టైల్ తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. అంతేకాదు అతని ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖం వర్ణం ప్రకారం చూసుకుంటే హార్దిక్ పాండ్యా నల్లగా ఉంటాడు. అతడి హెయిర్ స్టైల్ వైట్ గా ఉండడంతో.. డిఫరెంట్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు హార్థిక్ పాండ్యా. అయితే అతడి హెయిర్ స్టైల్ పట్ల యువత విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సరికొత్తగా ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
Back to business pic.twitter.com/Q1yEYAAoSw
— hardik pandya (@hardikpandya7) September 6, 2025