HomeతెలంగాణKalvakuntla Family Politics: కేటీఆర్ కవిత ఫైట్.. చివరికి కేసీఆర్ బలి

Kalvakuntla Family Politics: కేటీఆర్ కవిత ఫైట్.. చివరికి కేసీఆర్ బలి

Kalvakuntla Family Politics: తెలంగాణ రాష్ట్ర సాథనలో కీలక పాత్ర పోసించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రాన్ని పాలించాడు. కొడుకు, కూతురు, అల్లుడు, సడ్డకుని కొడుకు ఇలా సకుటుంబ సపరివార సమేతంగా పాలనలో భాగస్వాములయ్యారు. 2023 ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు కేసీఆర్‌ పార్టీని తిరస్కరించారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌లో కుమ్ములాటలు బయట పడ్డాయి. అధికారంలో ఉన్నప్పటి నుంచే ఆధిపత్య పోరు వార్తలు […]

Kalvakuntla Family Politics: తెలంగాణ రాష్ట్ర సాథనలో కీలక పాత్ర పోసించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రాన్ని పాలించాడు. కొడుకు, కూతురు, అల్లుడు, సడ్డకుని కొడుకు ఇలా సకుటుంబ సపరివార సమేతంగా పాలనలో భాగస్వాములయ్యారు. 2023 ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు కేసీఆర్‌ పార్టీని తిరస్కరించారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌లో కుమ్ములాటలు బయట పడ్డాయి. అధికారంలో ఉన్నప్పటి నుంచే ఆధిపత్య పోరు వార్తలు వచ్చినా నేతలు ఖండించారు. కానీ ఇప్పుడు అన్న చెల్లెలుకు పడడం లేదు.. బావా మరదలికి పడడం లేదు. దీంతో కూతురును ఒంటరి చేసి పార్టీనుంచి మెడలు పట్టి గెంటేసినంత పనిచేశారు. అయినా కూతురు బాపుకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు. అన్నను, బావనే టార్గెట్‌ చేస్తూ వచ్చింది. కానీ కొత్త పార్టీని లాంచ్‌ చేయబోతున్న కూతురు ఇప్పుడు బాపును కూడా టార్గెట్‌ చేసింది. మొత్తానికి అన్న చెల్లెలు గొడవలో చివరకు బాపే బలి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కుటుంబంపైనే కవిత విమర్శలు..
కవిత ఇప్పుడు విమర్శల కంచెను కుటుంబంలోకే మళ్లించినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు పరోక్షంగా మాత్రమే స్పృశించిన కేసీఆర్‌పై కూడా ఆమె నేరుగా ప్రశ్నలు సంధించడం, ఆమె రాజకీయ పంథాలో స్పష్టమైన మలుపు అని చెప్పొచ్చు.

కొత్త దశకు సంకేతం
కవిత బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి తాజాగా చేసిన వ్యాఖ్యలు కేవలం భావోద్వేగ స్పందనలా కాకుండా, తనకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తింపు నిర్మించాలనే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్‌ను టార్గెట్‌ చేయడం ద్వారా, బీఆర్‌ఎస్‌లోని అధికార కేంద్రాన్ని సవాల్‌ చేయడానికి కవిత సిద్ధమవుతున్నారనే భావన బలపడుతోంది.

విమర్శల వెనుక అర్థం
గులాబీ బాస్‌ కేసీఆర్‌ జగిత్యాల సభలో ప్రజలను తప్పుబట్టడం, ఉద్యమకారులకు స్థానం లేదనడం, మహిళల గౌరవాన్ని ప్రశ్నించడం వంటి అంశాలపై కవిత చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌ నేతృత్వంపై నేరుగా దెబ్బకొట్టేలా ఉన్నాయి. ఇవి కేవలం అసంతృప్తి వ్యక్తీకరణ కాదు, పార్టీ లోపల ఉన్న అధికార సమీకరణలను మార్చాలనే సంకేతాలుగా కూడా చదవొచ్చు.

రాజకీయ లెక్కలు
కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కొంటేనే తన రాజకీయ స్థానం స్పష్టమవుతుందని కవిత భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కుటుంబ రాజకీయాల్లో ఉన్న బంధం కంటే రాజకీయ స్పష్టత ముఖ్యమని ఆమె నిరూపించాలనుకుంటున్నారన్న అభిప్రాయం ఈ పరిణామాలతో బలపడుతోంది.

ఈ పరిణామం బీఆర్‌ఎస్‌ అంతర్గత రాజకీయాల్లో పెద్ద మార్పుకు దారితీయొచ్చు. ఒకవేళ కవిత ఈ ధోరణిని కొనసాగిస్తే, ఇది కేవలం వ్యక్తిగత అసమ్మతి కాదు, తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తి నిర్మాణానికి ఆరంభం కావచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper