MLA Anirudh Reddy: మొన్న ఆ మధ్యన పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)దిష్టి అనే మాటలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు పవన్. అక్కడే కొబ్బరి తోటలు ఉప్పు నీటితో నాశనం అయ్యాయి. వాటిని పరిశీలించిన పవన్ కళ్యాణ్ కోనసీమ అందాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ దిష్టి తగిలిందేమోనని వ్యాఖ్యానించారు. అయితే అలా విమర్శలు చేసిన నాలుగు రోజుల తర్వాత తెలంగాణలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు.హైదరాబాదులో ఆస్తులు సంపాదించి తెలంగాణపై వ్యాఖ్యానిస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో అడ్డుకుంటామని.. నిలిపి వేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు అదే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని జనసేన ట్రోల్ చేస్తోంది. సొంత గ్రామంలో సర్పంచ్ ను గెలిపించుకోలేకపోయారని.. పవన్ కళ్యాణ్ సినిమా ఆపేస్తారు అంటూ జన సైనికులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇది వైరల్ అంశంగా మారింది.
* సొంత గ్రామంలో ఓటమి..
మొదటి విడత పంచాయితీ ఎన్నికలు తెలంగాణలో( Telangana) జరిగిన సంగతి తెలిసిందే. ఈనెల 11న పంచాయితీ ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రకటన జరిగాయి. మెజారిటీ పంచాయతీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బిఆర్ఎస్ సైతం పట్టు నిలుపుకుంది. ఆ రెండింటితో పోల్చుకుంటే బిజెపి వెనుకబడింది. అయితే ప్రముఖుల సొంత గ్రామాల్లో మాత్రం ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అలాగే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామం రంగాయగూడలో బిజెపి అభ్యర్థి గెలిచారు. అప్పటినుంచి ఆయనపై ట్రోల్స్ ప్రారంభం అయ్యాయి. సొంత గ్రామంలో సర్పంచ్‌ను గెలిపించుకోలేని ఎమ్మెల్యే.. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తాడట అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. అయితే అది జనసైనికులు పెట్టింది కాదు అని.. తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల పని అని తెలుస్తోంది.
* అది ఎవరి పని?
ప్రస్తుతం ప్రతి రాజకీయ పార్టీకి సోషల్ మీడియా( social media) సైన్యం ఉంది. ప్రత్యర్ధులను నిశితంగా గమనిస్తున్నారు కూడా. అయితే మొన్న తెలంగాణ దిష్టి వ్యాఖ్యల వెనుక భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా అంతకుముందు తెలంగాణ నేతలు కోనసీమ లాంటి ప్రాంతం తమ రాష్ట్రంలో లేదే అని ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే కోనసీమలో కొబ్బరి పంట దారుణంగా దెబ్బ తినడంతో తెలంగాణ ప్రాంతీయల బాధను గుర్తుచేస్తూ దిష్టి తగిలిందేమోనని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. అయితే దీనిపై బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి తొలుతా మాట్లాడారు. అక్కడకు కొద్ది రోజుల తర్వాత ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. అటు తరువాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. అయితే బిఆర్ఎస్ వ్యాఖ్యానించిన తర్వాత కాంగ్రెస్ నేతలు స్పందించిన తీరును గుర్తించుకోవాలి. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీకి వచ్చి పవన్ కళ్యాణ్ పై ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. అదంతా భవిష్యత్తులో ఎప్పుడైనా తెలంగాణ వాదం మళ్లీ బయటకు వస్తే ఉపయోగించుకునేందుకే అని తేలిపోయింది. అందులో భాగంగా అనిరుధ్ రెడ్డి మాట్లాడారే తప్ప మరొకటి కనిపించడం లేదు. అయితే ఈ పోస్టులు పవన్ అభిమానులు పెట్టారా? తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థులైన బిఆర్ఎస్ శ్రేణులు పెట్టాయా? అన్నది తెలియాల్సి ఉంది.