Homeలైఫ్ స్టైల్Loneliness: ఒంటరితనం ..ఏకాంతంలోనే నిజమైన శక్తి

Loneliness: ఒంటరితనం ..ఏకాంతంలోనే నిజమైన శక్తి

Loneliness: ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుంది. కోవిడ్‌ సమయంలో క్వారంటైన్‌ సందర్భంగా చాలా మంది మరణించడానికి ఒంటరితనమే కారణం. ఈ కోవిడ్‌ మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. కోవిడ్‌ తర్వాత చాలా మంది కిలిసి ఉంటున్నారు. ఒంటరివాళ్లు పెట్స్‌ను పెంచుకుంటున్నారు. జీవిత ప్రయాణంలో ఒంటరితనం కేవలం ఒక అంకె కాదు.. అది స్వీయ ఆవిష్కరణకు మార్గం. వేదాంతులు, భౌతికవాదులు ఒంటరితంలోని సౌకర్యాన్ని ప్రశంసిస్తారు. దాన్ని అనుభవించినవారు దానికి దాసులవుతారు. బంధాల భ్రమే.. మనుషులు వస్తారు, పోతారు. జననం […]

Loneliness: ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుంది. కోవిడ్‌ సమయంలో క్వారంటైన్‌ సందర్భంగా చాలా మంది మరణించడానికి ఒంటరితనమే కారణం. ఈ కోవిడ్‌ మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. కోవిడ్‌ తర్వాత చాలా మంది కిలిసి ఉంటున్నారు. ఒంటరివాళ్లు పెట్స్‌ను పెంచుకుంటున్నారు. జీవిత ప్రయాణంలో ఒంటరితనం కేవలం ఒక అంకె కాదు.. అది స్వీయ ఆవిష్కరణకు మార్గం. వేదాంతులు, భౌతికవాదులు ఒంటరితంలోని సౌకర్యాన్ని ప్రశంసిస్తారు. దాన్ని అనుభవించినవారు దానికి దాసులవుతారు.

బంధాల భ్రమే..
మనుషులు వస్తారు, పోతారు. జననం కలయికలు, మరణం విడాకలు. బంధాలు ఆనందం ఇస్తాయి, బాధలు కూడా. కానీ శాశ్వతం లేని ఈ అనుబంధాలు చివరికి కన్నీరుతో ముగుస్తాయి. స్థిర ప్రజ్ఞులు పరిమితులు తెలుసుకుని ముందుకు సాగతారు. సామాన్యులు సాధనల ద్వారా ఈ బంధనాల నుంచి విముక్తి పొందవచ్చు.

ఒంటరితనంలో ఆనందం..
ఒంటరిగా గడిపే సమయం ఆత్మ పరిచయానికి దారి తీస్తుంది. ఇతరులపై ఆధారాలు తగ్గుతాయి. తాత్కాలిక సంబంధాల గందరగోళం లేకుండా, స్వీయ స్నేహం లౌకికాతీత సంతోషాన్ని ఇస్తుంది. ఇది జీవిత రహస్యాలను వెల్లడి చేస్తుంది. ఒంటరి బలహీనులు సాయం కోరుకుంటారు. శక్తివంతులు ఒంటరిగా నడుస్తారు. ఎవరెస్ట్‌ ఎక్కడం లాంటి కష్ట ప్రయాణం, కానీ ఫలితం అమూల్యం. ఏకాంత తీరాల్లో తనను తాను రూపొందించుకునే వారే జీవిత లక్ష్యాలను సాధిస్తారు.

చుట్టూ మెరిసే వెలుగులు తప్పుదారి పట్టించకూడదు. మినుగుడు వెలుతురును కాంతిగా తప్పుకుని, తనలోని శతకోటి శక్తిని గుర్తించాలి. ఆ ’ఒకటి’నే రథసారథిగా చేసుకుంటే జీవితం నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper