Honda Elevate ADV Edition: Honda కంపెనీకి చెందిన కొత్త మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకట్టుకుంటోంది. గత నవంబర్ 3న Honda Elivate ADV ఎడిషన్ కాంపాక్ట్ SUV కావడంతో ఈ వేరియంట్ కొనుగోలు చేసేవారికి అద్భుత అవకాశం అని అంటున్నారు. టాప్ స్పెక్ zx వేరియంట్ ఆధారంగా నిర్మీతమైన ఈ ప్రత్యేక ఎడిషన్ ను బోల్డ్ స్టైలింగ్ డిజైన్ తో ఉండడంతో కార్ల వినియోగదారులను ఇంప్రెస్ చేస్తుంది. అయితే మొత్తం ఇది మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది లేటేస్ట్ గా హోండా ఎలివేట్ అడ్వాన్స్డ్ ఆకట్టుకుంటోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
జపాన్ కంపెనీకి చెందిన Honda కొత్త SUV స్పెషల్ ఎడిషన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. Honda Elivate Advance Edition పేరుతో ఉన్న ఇందులో ఎక్సీటీరియర్స్ డిజైన్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. హుడ్ మీద , డోర్స్ పై ADV టెర్రైన్ డెకల్, యాక్టివ్ అరెంజ్ యాక్సెంట్స్ తో ఉండే అల్లాయ్ వీల్స్, ఆరెంజ్ ఫాగ్ ల్యాంప్ గార్నిష్, టెయిల్ గేట్ పై ADV చిహ్నాలు, హౌంటెన్ ఫెండర్ బ్యాడ్జ్, స్పాయిలర్ తో పూర్తిగా బ్లాక్ సన్ రూప్స్ ఆకట్టుకుంటున్నాయి. 1498 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఇది మాన్యువల్ 6 స్పీడ్, ఆటోమేటివ్ 7 స్పీడ్ వేగంతో వెళ్తుంది. లీటర్ ఇంధనానికి 16.92 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
ఈ కొత్త ఎడిషన్ ‘మీలోని అన్వేషకుడికి ఒక బోల్డ్ కంపానియన్’ వీడియో పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోతో ఈ మోడల్ గురించి తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తున్నారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం 1498 సీసీ ఇంజిన్ 119 బీహెచ్ పీ పవర్ తో పనిచేస్తుంది. 5 సీటింగ్ సామర్థ్యం ఉంది. 4 సిలిండర్ కలిగిన ఇందులో మాన్యువల్ తో పాటు ఆటోమేటివ్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ పనిచేస్తుంది. మార్కెట్లో దీనిని రూ.15.29 లక్షలతో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్ కు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఎలివేట్ అడ్వాన్స్డ్ మల్టీ ఫంక్షన్ వీల్ తో పాటు పవర్ అడ్జస్టబుల్ ను కలిగి ఉంది. అలాగే రియర్ వ్యూ మిర్రర్, టచ్ స్క్రీన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ చేయనుంది. యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ తో పాటు పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్ వంటి సేప్టీ ఫీచర్స్ ఉన్నాయి.