spot_img
HomeతెలంగాణJanasena: తెలంగాణపై జనసేన ఫోకస్‌.. పవన్‌ ప్లాన్‌ ఏంటి?

Janasena: తెలంగాణపై జనసేన ఫోకస్‌.. పవన్‌ ప్లాన్‌ ఏంటి?

Janasena: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతోందా అంటే అవుననే అంటున్నాయిన పార్టీ శ్రేణులు. నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభానికి ఐదు రోజుల ముందు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సమన్వయకమిటీ ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఏపీలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలో దిగాయి. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.

పార్టీ వీడుతున్న నేతలు..
ఇక ఏపీలో జనసేన టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలోకి క్యూ కట్టారు. తమకు టికెట్లు ఇవ్వలేదనే బాధ కంటే.. పక్క పార్టీల నుంచి పిలిచి మరి టికెట్‌ ఇవ్వడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే పోతిన మహేష్, మనుక్రాంత్‌రెడ్డి, పితాని బాలకృష్ణ, పాముల రాజేశ్వరి సహా పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. మరికొందరు అదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో జనసేనాని అలర్టయ్యారు. మొన్నటి వరకు అసంతృప్తులపై కన్నెత్తి కూడా చూడని పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు.

తెలంగాణపై ఫోకస్‌..
మరోవైపు జనసేనాని తెలంగాణపై కూడా ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. బొంగునూరి మహేందర్‌రెడ్డి సమన్వయకర్తగా, శంకర్‌గౌడ్, రాజలింగం, పొన్నూరి శిరీష, ప్రేమ్‌కుమార్, ములుకుంట్ల సాగర్‌ సభ్యులుగా ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 7 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఆశించినమేర సక్సెస్‌ కాలేదు. లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో ఖాతా ఓపెన్‌ చేస్తుందా లేదా అనేది చూడాలి.

ఒంటరిగా పోటీ కష్టమే..
ఆంధ్రప్రదేశ్‌లోనే ఒంటరిగా పోటీ చేయడానికి వెనుకాడిన పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయరని విశ్లేషకులు అభిప్రాపయడుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని పోటీ చేయకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఏపీలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, ఇప్పటికే తెలంగాణలో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ఈ క్రమంలో జనసేన హడావుడి చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రత్యక్షంగా పోటీ చేస్తారా లేక గతంలో లాగా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper