Vijaya Sai Reddy : విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) కామెంట్స్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త చర్చకు దారితీశాయి. ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. అధినేతతో పాటు పార్టీ నేతల వైఖరి పై ఎక్కువ మంది మాట్లాడారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం కోటరీ అన్న పదం వాడారు. అయితే ఇప్పటివరకు ఆ కోటరీలో ప్రధాన నేతగా ఉన్నారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు అదే నేత కోటరీ అనే పదం వాడడం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. అసలు విజయసాయిరెడ్డి టార్గెట్ చేసిన జగన్ కోటరీ నేతలు ఎవరు? విజయసాయిరెడ్డి ఎవరికోసం ఈ వ్యాఖ్యలు చేశారనేది రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. పైగా గతంలో ఎన్నడూ వినిపించని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు వెల్లడించారు విజయసాయిరెడ్డి. లిక్కర్ స్కాం కు ఆయనే సూత్రధారి అని తేల్చి చెప్పారు. అంటే ఏపీలో లిక్కర్ స్కాం జరిగినట్టే కదా. సాయి రెడ్డి లీకులు ఇచ్చినట్టే కదా. అవసరమైతే మరింత సమాచారం ఇస్తానని ఎందుకు చెప్పినట్టు? ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇదే చర్చ.
Also Read : వ్యవసాయమా.. చంద్రబాబుకు సాయమా? విజయసాయి రెడ్డి పై వైసీపీ కౌంటర్!
కాకినాడ సి పోర్టు( Kakinada sea port ) వాటాల విషయంలో అనేక వివాదాలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో కెవి రావు ఫిర్యాదు చేసిన సమయంలో ఇదే విజయసాయిరెడ్డి వై వి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి చిన్నపిల్లాడు అంటూ వ్యాఖ్యానించారు. విక్రాంత్ రెడ్డికి ఏ పాపం తెలీదని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అదే విక్రాంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. కోర్టు కేసులో అంతా విక్రమ్ రెడ్డి కేంద్రంగా జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే విజయసాయిరెడ్డి కోటరీ అనే పదాన్ని ఎందుకు వినియోగించారో అర్థం అవుతోంది.
* ఆ కుటుంబానికి విధేయుడు
వైయస్ కుటుంబానికి( YSR family) అత్యంత విధేయుడుగా ఉంటూ వచ్చారు విజయసాయిరెడ్డి. ముందుగా రాజశేఖరరెడ్డికి, అటు తరువాత జగన్మోహన్ రెడ్డి వద్ద పనిచేశారు. వారి ఉన్నతికి పాటుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కోసం కేసులను ఎదుర్కొన్నారు. జైలుకు వెళ్లారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కూడా ఎనలేని కృషి చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఓ ఇద్దరు నేతల వైఖరితో జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారన్న టాక్ ఉంది. ఆ ఇద్దరు నేతలని జగన్ కోటరీగా పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.
* వైవి సుబ్బారెడ్డి ద్వారా చెక్..
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు విజయసాయిరెడ్డి. తొలి మూడేళ్లు బాగానే పనిచేశారు. కానీ ఉన్నఫలంగా విజయసాయిరెడ్డిని తొలగించి.. ఆ స్థానంలో తన బాబాయి వైవి సుబ్బారెడ్డిని నియమించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ ఎన్నికల ఫలితాలు అనంతరం తిరిగి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత పదవి నుంచి తప్పించారు. ఆ పదవిని వైవి సుబ్బారెడ్డి కి ఇచ్చారు. సుబ్బారెడ్డి స్థానంలో ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ పోస్ట్ ను మాత్రం విజయసాయిరెడ్డికి ఇచ్చారు. అయితే వైవి సుబ్బారెడ్డి ద్వారా తనకు చెప్తారన్నది విజయసాయిరెడ్డి అనుమానం. అందుకే కోటరీలో నెంబర్ వన్ వై వి సుబ్బారెడ్డి.
* సజ్జలపై అనుమానం
మరోవైపు పార్టీలో విజయసాయిరెడ్డి పాత్రను తగ్గించడంలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajal Ramakrishna Reddy ). పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేవరకు పార్టీలో నెంబర్ టు గా ఎదిగారు విజయసాయిరెడ్డి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాత్రలోకి ప్రవేశించారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీలో శక్తివంతమైన విభాగంగా సోషల్ మీడియా విభాగం ఉంది. దానికి సారధ్య బాధ్యతలు చూసేవారు విజయసాయిరెడ్డి. ఆ బాధ్యతల నుంచి సైతం విజయసాయిరెడ్డిని తప్పించారు. సజ్జల కుమారుడికి అప్పగించారు. అందుకే విజయసాయిరెడ్డి తన మాట చెల్లుబాటు కావడంతో పార్టీ చెప్పారు. అందుకు ఆ ఇద్దరు కోటరీ కారణమని చెప్పుకొస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : అడుగడుగునా అవమానాలు.. విజయ సాయి రెడ్డి నిష్క్రమణకు కారణాలు అవే!