https://oktelugu.com/

KCR : కేసీఆర్‌కు గట్టి షాక్‌ ఇచ్చిన హైకోర్టు

KCR అయితే తనకు జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్‌ కమిషన్‌ను కోరారు. తర్వాత 12 పేజీల లేఖలో పలు అంశాలను ప్రస్తావిస్తూ వివరణ ఇచ్చారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2024 / 12:26 PM IST

    KCR

    Follow us on

    KCR : విద్యుత్‌ ఒప్పందాల్లో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్‌ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ కమిషన్‌ రద్దు విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు షాక్‌ తగిలింది. కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్‌ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది.

    ఏకపక్షంగా వ్యవహిస్తోందని కేసీఆర్‌..
    తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్‌ కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, విచారణ జరుపకుండానే గత ప్రభుత్వం హయాంలో తప్పులు జరిగాయని నిర్ధారణకు వచ్చింది.. ఈమేరకు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ప్రకటించిందని కేసీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు కమిషన్‌ కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులకు 12 పేజీల సమాధానం ఇచ్చారు. తర్వాత కమిషన్‌ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే కమిషన్‌ కేసీఆర్‌ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదు. తాజాగా విచారణకు రావాలని ఆయనకు నోటీసులు పంపింది.

    పిటీషన్‌ కొట్టివేత..
    కమిషన్‌ ఏకపక్షంగా విచారణ జరుపుతోందని కేసీఆర్‌ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. నిబంధనల మేరకే విద్యుత కమిషన్‌ వ్యవహరిస్తోందని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) కోర్టుకు తెలిపారు. ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదని, ప్రెస్‌మీట్‌లోనూ ఎలాంటి విషయాలు వెల్లడించలేదని కోర్టుకు విన్నవించారు. దీంతో ఏజీ వాదనతో హైకోర్టు సీజే ధర్మాసనం ఏకీభవించింది. దీంతో కేసీఆర్‌ దాఖలు చేసిన పిటీషన్‌ కొట్టివేసింది.

    నోటీసులకు స్పందించని కేసీఆర్‌..
    బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు విద్యుత్‌ కొనుగోళ్లపై ఏర్పాటైన జుడీషియల్‌ కమిషన్‌ జూన్‌ 11న నోటీసులు ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. జూన్‌ 15లోపు వివరణ ఒప్పందంలో కేసీఆర్‌ పాత్రపై వివరణ ఇవ్వాలని జస్టిస్‌ నర్సింహారెడ్డి నోటీసులు ఇచ్చింది. అయితే తనకు జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్‌ కమిషన్‌ను కోరారు. తర్వాత 12 పేజీల లేఖలో పలు అంశాలను ప్రస్తావిస్తూ వివరణ ఇచ్చారు.