Errabelli Dayakar Rao: తెలంగాణలో 15 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయింది. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయమని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా హస్తం పార్టీ విజయం సాధించింది. బీఆర్‌ఎస్ ఓడినా.. సీనియర్లు అయిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి వారికి ఓటమి ఉండదని భావించారు. కానీ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు గెలిచారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు మాత్రం ఓడారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రెబెల్లి నియోజవర్గం మారినా. పార్టీతో సంబంధం లేకుండా గెలుస్తూ వచ్చారు. కానీ, 2023 నవంబరులో జరిగిన ఎన్నికల్లో తన రాజకీయ అనుభవం అంత వయసు కూడా లేని మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
ఆరు నెలల ముందే తెలుసట..
ఇక తన ఓటమి గురించి ఆరు నెలల ముందే తెలుసని అంటున్నారు ఎర్రబెల్లి. వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రోత్సాహంతోనే పోటీ చేశాన్నారు. కేసీఆర్ దార్శినికతతో పోలిస్తే 15 నెలల్లో కాంగ్రెస్ అన్నిరంగాల్లో విఫలమైందని విమర్శించారు. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం అయ్యారని తెలిపారు. ఆరు నెలలుగా రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. రేవంత్ పాలనతీరు తెలుసుకునేందుకు రాహుల్‌గాంధీ∙వరంగల్‌కు ఆవాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అయితే సీఎం కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి రాహుల్ పర్యటన రద్దు చేయించారని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ ఓటమి కూడా..
ఇక తన ఓటమి గురించి ఆరు నెలల ముందే తెలుసుకున్న ఎర్రబెల్లి.. గతంలో బీఆర్‌ఎస్ ఓడిపోతుందని కూడా అంచనా వేశారు. తన సొంత సర్వే చేయించారు. ఇందులో బీఆర్‌ఎస్ అధికారంలోకి రాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కూడా ఆయనే వెల్లడించారు. తాజాగా ఆయన తన ఓటమి గురించి చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు బీఆర్‌ఎస్ ఓటమి కూడా నాడు ఆయన చెప్పినట్లే జరిగిందన్న చర్చ జరుగుతోంది. అయితే నాడు ఎర్రబెల్లి∙అంచనాలను సొంత పార్టీ నేతలే తప్ప పట్టారు. ఇప్పుడు ఆయన మాటలే నిజమయ్యాయని చర్చించుకుంటున్నారు.