Homeఅంతర్జాతీయంDonald Trump: ఆ విషయంలో మోదీతో పోటీ పడలేదు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు!

Donald Trump: ఆ విషయంలో మోదీతో పోటీ పడలేదు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు!

Donald Trump: భారత ప్రధాని నరేంద్రమోదీ(anarendra modi).. అమెరికా పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటన కోసం ఫిబ్రవరి 13న అమెరికా వెళ్లారు. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయనను కలుస్తున్న కొద్ది మంది విదేశీ నేతల్లో మోదీ కూడా ఒకరు.

భారత ప్రధాని నరంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)ఆత్మీయ ఆతిథ్యం స్వీకరించారు. దేశాధినేతలిద్దరూ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. మోదీ తనకంటే కఠినమైన సంధానకర్త అని పేర్కొన్నారు. ఆ విషయంలో తాను మోదీతో పోటీ పడలేనని తెలిపారు. మోదీ గ్రేట్‌ అని అభినందించారు. అంతకముందు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. వాణిజ్య, రక్షణబంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ కొన్ని గంటల క్రితమే భారత్‌ బయల్దేరారు.

మోదీకి ట్రంప్‌ బహుమతి..
ఇదిలా ఉంటే.. మోదీకి ట్రంప్‌ బహుమతి ఇచ్చారు. ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా కీలక సందర్భాలు, ప్రధాన ఈవెంట్లు, హౌడీ మోడీ, నమస్తే ట్రంప్‌ కార్యమ్రాల ఫొటోలతో కూడిన పుస్తకం ఇచ్చారు. ఈ పుస్తకం మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ యూ ఆర్‌ గ్రేట్‌(Mistet prime minister you are great)అని రాసిన ట్రంప్‌ సంతకం చేశారు. పుస్తకంలోని పేజీలను తిప్పుతూ ఇద్దరూ ఉన్న ఫొటోలను మోదీకి చూపించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular