Deputy CM Pawan Kalyan : నేడు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతం లో నిర్వహించిన రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అతిథి గా పాల్గొన్నాడు. ఈ వేడుకకు బీజేపీ కేంద్ర గనుల శాఖామంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తో పాటు రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ లతో పాటు బీజేపీ ముఖ్య నాయకులూ ఈ వేడుక లో పాల్గొన్నారు. ఈ వేడుక లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘మన మాతృ భాష తెలుగు కావొచ్చు, కానీ రాష్ట్ర భాష (దేశ భాష) మాత్రం హిందీనే. ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడానికి మాతృ భాష ఉంది. కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మన రాజ్య భాష హిందీనే. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటాము’.
Also Read: సంజయ్ దత్ ను బయటపెట్టిన ప్రభాస్… ఆయనతో మామూలుగా ఉండదు…
‘కానీ మన దేశం మొత్తం ఈరోజున ఏకం కావడానికి ఈరోజు మన రాష్ట్ర భాష హిందీ నే కావాలి. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీ ని ఈరోజు స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలో కావొచ్చు, తెలుగు, తమిళం,కన్నడ మరియు ఏ ఇతర భాష అయినా కావొచ్చు, మన రాష్ట్ర భాష మీద గౌరవం ఉంటుంది. మన మాతృ భాష అమ్మ అయితే, మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి వీటి అన్నిటికి అన్ని భాషల మాండలికాలు గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్నాము, వీటి అవసరం కోసం. ఇలాంటి సమయం లో హిందీ ని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేస్తుంది. మనం హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికి ని కోల్పోవడం కాదు, మరింత బలం ని సమకూర్చుకోవడం’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలు సంచలనంగా మారాయి. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : ఐదు బంతుల్లో ఐదు వికెట్లా? అవి బంతులా బుల్లెట్లా? ఏం వేశావురా సామీ..
పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు పెట్టుకున్న తర్వాత పూర్తిగా మారిపోయాడని, ఒకప్పుడు హిందీ బాషాని రుద్దొడు అంటూ ప్రసంగాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏకంగా హిందీ భాష ని ఈ స్థాయిలో వెనకేసుకొని వస్తున్నదని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దీనిపై ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. హిందీ బాషాని రుద్దడం పై పవన్ కళ్యాణ్ ఇప్పటికీ వ్యతిరేకమే,కానీ ఆయన హిందీ భాషనీ ద్వేషించడం తప్పని అంటున్నాడు. ఒక వ్యక్తి ఎన్ని భాషలు నేర్చుకోవాలి అనేది ఆ వ్యక్తి ఇష్టం, హిందీ భాష ఇప్పుడు నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఎక్కడికి వెళ్లిన కమ్యూనికేషన్ చెయ్యాలంటే ఆ భాష ని కచ్చితంగా నేర్చుకోవాలి, దీని పై రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఈ ప్రసంగం మీదనే చర్చలు నడుస్తున్నాయి.