England India 3rd Test: టెండూల్కర్ – అండర్సన్ సిరీస్ లో భాగంగా టీమిండియా, ఇంగ్లీష్ జట్లు లార్డ్స్ వేదికగా మూడవ టెస్ట్ ఆడుతున్నాయి. ఈ టెస్టులో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు నాలుగు వికెట్ల కోల్పోయి 251 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్(99), స్టోక్స్(39) ఉన్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు ఇప్పటివరకు 79 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు.
వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టు అంటే బజ్ బాల్ గేమ్ గుర్తుకు వస్తుంది. టెస్ట్ ను సైతం వన్డే తరహాలో ఆడతారు. ఏ మాత్రం కనికరం లేకుండా పరుగులు సాధిస్తుంటారు. సుదీర్ఘ ఫార్మాట్లో సహనాన్ని పక్కనపెట్టి.. ఓర్పును దూరం పెట్టి.. కేవలం బాదడమే పనిగా పెట్టుకుంటారు. అందువల్లే టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టు సంచలనాలను సృష్టిస్తోంది. గతంలో జరిగిన ఓ టెస్ట్ సిరీస్ లో ఇంగ్లీష్ జట్టు వన్డే తరహాలో బ్యాటింగ్ చేసింది. ఇటువంటి సంచనాలు సృష్టించిన ఇంగ్లీష్ జట్టు ఇప్పుడు ఆ స్థాయిలో ఆడలేక పోతోంది. ముఖ్యంగా తొలి రెండు టెస్టులలో దూకుడుగా ఆడిన ఇంగ్లీష్ జట్టు మూడవ టెస్టులో సైలెంట్ అయిపోయింది.
Also Read:ఐదు బంతుల్లో ఐదు వికెట్లా? అవి బంతులా బుల్లెట్లా? ఏం వేశావురా సామీ..
మూడవ టెస్టులో రూట్ మినహా క్రావ్ లే (18), డకెట్(23), పోప్(44) , బ్రూక్(11) విఫలమయ్యారు. వాస్తవానికి ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టులలో అదరగొట్టారు. కానీ మూడో టెస్ట్ లో మాత్రం విఫలమయ్యారు.. లార్డ్స్ మైదానంలో భారత బౌలర్ల ముందు తలవంచారు. వాస్తవానికి బజ్ బాల్ గేమ్ ఆడే భీకరంగా బ్యాటింగ్ చేయడం పెద్ద కష్టం కాదు. పైగా సొంతమైదానాలలో వారికి అద్భుతమైన రికార్డ్ ఉంది. లార్డ్స్ మైదానంలో కూడా వారు భీకరంగా బ్యాటింగ్ చేశారు. కానీ టీమ్ ఇండియా తో మాత్రం తేలిపోయారు. ఒక్కరోజులోనే దాదాపు 300 కు మించి పరుగులు చేసిన చరిత్ర ఇంగ్లాండ్ జట్టుకుంది. అయితే అలాంటి జట్టు లార్డ్స్ లో తేలిపోవడం విశేషం.
ఇంగ్లాండ్ జట్టు డిఫెన్స్ ఆడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారీగా పరుగులు చేసే ఆటగాళ్లు ఇలా బంతులను కాచుకోవడం ఏంటని మండిపడుతున్నారు. ఇదే సమయంలో టీమిండియా బౌలర్ సిరాజ్ కూడా ఇంగ్లాండ్ బ్యాటర్ రూట్ ను ప్రశ్నించాడు.. ఇంత స్లోగా ఆడుతున్నావ్ ఎందుకు అని అడిగాడు. బజ్ బాల్ గేమ్ ఏమైందని పేర్కొన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Also Read: బాల్ రా మామ, బాగుందిరా మామ..” కోడ్ భాష ఇప్పుడు తెలుగు
రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి ఇబ్బంది పడింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో బ్రూక్, స్మిత్ అదరగొట్టారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 300 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో ప్లాట్ పిచ్ పై ఇంగ్లాండ్ బ్యాటర్లు తేలిపోయారు. ఈ నేపథ్యంలో మూడో టెస్ట్ లో దూకుడుగా కాకుండా.. సమయోచితంగా బ్యాటింగ్ చేయాలని ఇంగ్లాండ్ ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తున్నారు.. అయితే శుక్రవారం నాడు మిగతా వికెట్లు మొత్తం పడగొట్టి.. త్వరగా ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు.
Mohammad Siraj asking Joe Root where is the Bazball. pic.twitter.com/PF7XhI58hS
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 10, 2025