Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ కూడా పూర్తయింది. బరిలో నిలిచేది ఎవరో తేలిపోయింది. ఎన్నికలలో నిలబడే అభ్యర్థులు ఖరారు అవడంతో అన్ని పార్టీలు ప్రచారం పైనే దృష్టి పెట్టాయి. ఏ పార్టీకి ఆ పార్టీ విజయం కోసం ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. అయితే ఈసారి ఎలెక్షన్స్‌లో చాలా మంది అభ్యర్థులు 50 ఏళ్లు పైబడిన నేతలే. కానీ ఇద్దరు యువ అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో నిలిచారు. 26 సంవత్సరాలకే వారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
పాలిటిక్స్‌కు దూరంగా యువత..
యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాల్లో రాణించేందుకు చేయడం లేదు. రాజకీయాలు అంటే అవేవో అంటరానిది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అలా అని పార్టీలకూ దరంగా ఉండడం లేదు. ఏదో ఒక పార్టీ నాయకులకు మద్దతుగా ఉంటున్నారు. వారి కోసం, వారి తరఫున పనిచేస్తున్నారు. తమ ఎదుగుదల గురించి మాత్రం పెద్దగా ఆలోచన చేయడం లేదు. రాజకీయాల్లోకి యువత రావాలని ఎప్పటి నుంచో నాయకులు చెబుతూ వస్తున్నారు. కొందరు నాయకుల ప్రసంగాల్లో కూడా యువత రాజకీయాలలో అడుగుపెట్టాలని చెప్పడం వింటూ ఉంటాం. యువత చట్టసభలోకి పంపడం అనేది అరుదుగా జరుగుతుంది. ఉద్యమ పార్టీగా పుట్టిన బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్), తెలంగాణ వచ్చిన తరువాత ఉద్యమంలో పాల్గొన్న చాలామంది యువకులకు అసెంబ్లీ ఎలెక్షన్స్‌లో పోటీ చేసే ఛాన్స్ కల్పించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్న వంశీ చందర్‌రెడ్డికి 2014లో టికెట్ ఇచ్చింది. అలాగే ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించినప్పుడు యువతాకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, ఖరీదైన రాజకీయాలను తట్టుకోలేక యువత ఇప్పుడు రాజీయాలకు దూరంగా ఉంటున్నారు.
పిన్న వయసులో.. అసెంబ్లీ బరిలో
తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల్లో ఇద్దరు 26 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. సీనియర్ లీడర్, మల్కాజిగిరి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన మైనంపల్లి హనుమంతరావు, ఆయన కొడుకు ఈసారి ఇద్దరు పోటీచేయాలని బీఆర్‌ఎస్ పార్టీలో ప్రయత్నాలు తీవ్రంగా చేశారు. అయితే కొడుకికి టికెట్ దొరకకపోవడంతో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరి ఇద్దరూ టికెట్ సాధించారు. మెదక్ టికెట్ రోహిత్‌కు, మల్కాజిగిరి టికెట్ హనుమంతరావుకు కేటాయించింది కాంగ్రెస్. రోహిత్ కు 26 ఏళ్లు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్స్‌లో పోటీచేస్తున్న అభ్యర్థులందరిలో కెల్లా రోహిత్ ది అతి తక్కువ వయసు. ఇక పాలకుర్తి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న యశస్వినిరెడ్డి కూడా పిన్నవయçరÆలలే. ఆమె వయసు 26 ఏళ్లు. అయితే మైనంపల్లి రోహిత్ కన్నా యశస్వినిరెడ్డి కొన్ని నెలలు పెద్దది. నిజానికి ఈ టికెట్ ఆమె అత్త ఎన్‌ఆర్‌ఐ ఝాన్సీ రెడ్డికి కేటాయించారు. భారత పౌరసత్వం కోసం ఝాన్సీరెడ్డి పెట్టిన దరఖాస్తు తిరస్కరించడంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆమె యశస్వినిరెడ్డిని ఎన్నికల బరిలో నిలిపారు. మరి తలపండిన నేతలతో తలపడుతున్న ఈ ఇద్దరు యువ పొలిటీషియన్స్ ఎన్నికల్లో గెలుస్తారో లేదో చూడాలి.