Kalki Movie: కల్కి సినిమాలో ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా హైలెట్ గా నిలిచినవి ఇవే…

Kalki Movie: కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ మొదట్లో కొంచెం సెల్ఫిష్ క్యారెక్టర్ గా సాగుతుంది. ఇక దాన్ని చివరలో మహాభారతానికి లింక్ చేసి చెప్పడంతో అద్భుతమైన ఎలిమెంట్ గా వర్కౌట్ అయింది.

Written By: Gopi, Updated On : June 27, 2024 5:42 pm

Kalki movie highlights

Follow us on

Kalki Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కల్కి సినిమాతో ఒక ప్రభంజనాన్ని సృష్టించడానికి నాగ్ అశ్విన్ ప్రభాస్ ఇద్దరూ కలిసి ఈరోజు బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేయడానికి కల్కి సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పటికే పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా లో కొన్ని ముఖ్యమైన ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హైలెట్ గా నిలిచిన సీన్లు ఇవే…

కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ మొదట్లో కొంచెం సెల్ఫిష్ క్యారెక్టర్ గా సాగుతుంది. ఇక దాన్ని చివరలో మహాభారతానికి లింక్ చేసి చెప్పడంతో అద్భుతమైన ఎలిమెంట్ గా వర్కౌట్ అయింది. ఇక అలాగే అశ్వద్ధామ క్యారెక్టర్ చాలా బాగా ఎలివేట్ అయింది. నిజానికి ప్రభాస్ కంటే కూడా అమితాబచ్చన్ చేసిన అశ్వద్ధామ క్యారెక్టర్ హైలెట్ గా నిలిచింది. ఇక ఈ ఏజ్ లో కూడా ఆయన అంతటి పొటెన్షియల్టిని చూపిస్తూ యాక్టింగ్ చేస్తూ ఆక్షన్ ఎపిసోడ్లో కూడా పాల్గొన్నడంటే మామూలు విషయం కాదు. 80 సంవత్సరాల వయసులో రెస్టు తీసుకోకుండా ఆయన సినిమా మీద ప్యాషన్ తో ఈ సినిమాని చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి.

అయితే కల్కి సెకండ్ పార్ట్ లీడ్ తో క్లైమాక్స్ లో చాలా అద్భుతమైన ఎమోషనల్ డ్రామా తో సినిమాని ముగించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇక సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూసేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు… ఇక మొత్తానికైతే నాగ్ అశ్విన్ తను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతి క్యారెక్టర్ లో మైన్యుయర్ డీటెయిల్స్ ని కూడా చాలా అద్భుతంగా చెప్పడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు… ఇక ప్రభాస్ అమితాబ్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంది…

ఇక ఏది ఏమైనప్పటికీ క్లైమాక్స్ మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు మనం చూడని రేంజ్ లో నాగ్ అశ్విన్ చూపించడం అనేది ఒక విజువల్ వండర్ అనే చెప్పాలి. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ఇలాంటి ఒక ఎపిసోడ్ ను మనం చూస్తాం. కానీ మొదటిసారి ఇండియన్ సినిమాలలో కూడా ఇలాంటివి చేయొచ్చు అని చేసి చూపించాడు…