CM Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ చుట్టూ కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. పార్టీలో అంతర్గత చర్చలపై కొందరు నేతలు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. అధిష్టానానికే వార్నింగ్ ఇస్తున్నారు. చేసులో తనకు పోటీగా ఉన్న సహచర ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకటనలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తీవ్రంగా స్పందించారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్(Hotel Nova tel)లో మంగళవారం(ఏప్రిల్ 15, 2025న) సీఎల్పీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి(Chamal Kirankumar Reddy)కి సీఎం క్లాస్ పీకారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
మంత్రి పదవులపై చామల వ్యాఖ్యలు
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చర్చలు ఊపందుకున్న నేపథ్యంలో, కొందరు నాయకులు మంత్రి పదవుల కేటాయింపుపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి కొందరు నాయకులను మంత్రులుగా ప్రకటిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం సీఎల్పీ(CLP) సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి చర్యలు పార్టీలో గందరగోళాన్ని సృష్టిస్తాయని, నాయకులందరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని రేవంత్‌రెడ్డి హెచ్చరించినట్లు తెలుస్తోంది.
హైకమాండ్ నిర్ణయమే ఫైనల్..
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన నిర్ణయాలు కాంగ్రెస్ హైకమాండ్(Congress High Camand) తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. మంత్రి పదవుల ఎంపికలో హైకమాండ్ ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ఎవరిని మంత్రులుగా నియమించాలనే విషయంలో హైకమాండ్ సూచనల మేరకు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అందరూ ఈ నిర్ణయాన్ని గౌరవించాలని రేవంత్‌రెడ్డి నాయకులకు సూచించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు చామల కిరణ్ కుమార్‌రెడ్డి వంటి నాయకులకు స్పష్టమైన సందేశంగా భావిస్తున్నారు.
పార్టీలో క్రమశిక్షణపై దృష్టి..
మంత్రివర్గ విస్తరణ చుట్టూ జరుగుతున్న చర్చలు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకుల వ్యాఖ్యలు పార్టీ ఐక్యతను దెబ్బతీసే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో, అనవసరమైన ప్రకటనలు, ఊహాగానాలు నాయకులు ఆపాలని, పార్టీలో క్రమశిక్షణ కాపాడాలని ఆయన సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం, పార్టీ ఇమేజ్‌ను కాపాడటం అందరి బాధ్యత అని రేవంత్ రెడ్డి నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణ చర్చ
సీఎల్పీ సమావేశంలో మంత్రివర్గ విస్తరణతోపాటు, పార్టీలో అంతర్గత విభేదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడం, పార్టీని బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా, అందరూ ఒక్కతాటిపై ఉండి ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణను నొక్కి చెప్పే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో నాయకుల మధ్య అసంతృప్తి, వర్గ పోరు తలెత్తే అవకాశం ఉందని, దీనిని నియంత్రించేందుకు రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అంటున్నారు. హైకమాండ్ నిర్ణయాలను గౌరవించడం ద్వారా పార్టీ ఐక్యతను కాపాడాలని భావిస్తున్నారని, ఈ సందేశం చామల కిరణ్ కుమార్ రెడ్డితోపాటు ఇతర నాయకులకు కూడా గట్టిగా చేరిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : గులాబీ తుఫాను రాగం… కేటీఆర్ రాజకీయ జోష్యం