spot_img
Homeబిజినెస్Honda Amaze 2026: మైలేజ్ 24 కి.మీ... ధర రూ.8 లక్షల లోపే.. ఈ కారు...

Honda Amaze 2026: మైలేజ్ 24 కి.మీ… ధర రూ.8 లక్షల లోపే.. ఈ కారు గురించి తెలిస్తే వెంటనే కొంటారు..

Honda Amaze 2026: నేటి కాలంలో ప్రతి ఇంట్లో ఒక కారు ఉండాలని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే ఏ కారు కొనాలి? అన్న ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతుంది. కొందరు బడ్జెట్ విషయం ఆలోచిస్తే.. మరికొందరు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే కార్ల కోసం చూస్తారు. అయితే అన్ని రకాలుగా అనుగుణంగా ఉండి మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే కొన్ని కంపెనీలు ఉన్నాయి. అలాంటి వాటిలో Honda కంపెనీ ఒకటి. దీని నుంచి ఇప్పటికే ఆకట్టుకునే కార్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు మైలేజ్ ఎక్కువగా ఇవ్వడంతోపాటు స్టైలిష్ గా డిజైన్ ను రూపొందించుకున్న ఓ కొత్త కారు ఆకర్షిస్తుంది. దీని ధర కూడా రూ. 10 లక్షల లోపే ఉండడంతో చాలామంది దీని వైపు ఆకర్షితులవుతున్నారు. ఇంతకు ఈ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా?

Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!

Honda కంపెనీకి చెందిన Amaze ఇప్పుడు కొత్త తరహాలో రాబోతుంది. ఇప్పటికే మార్కెట్లో ఈ కారుకు అత్యంత డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు రిఫ్రెష్డ్ కాంపాక్ట్ సెడాన్ కారుగా రాబోతోంది. అయితే ఈ కారు ఎలా ఉందో సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ సాగుతోంది. కొన్ని కొన్ని విషయాలు కంపెనీ నుంచి లీక్ కావడంతో ఈ కారు ఎలా ఉండబోతుందో అంచనా వేస్తున్నారు. ఈ కారు నేటి తరం వారిని ఆకట్టుకునే విధంగా స్టైలిష్ డిజైన్తో ఉండబోతుంది. దీని ముందటి భాగంలో LED హెడ్ లాంప్స్ ప్రీమియం లుక్ ను అందించే విధంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న బంపర్ ను తిరిగి మార్చారు. దీంతో ఇది సెడాన్ కారు అయినప్పటికీ ప్రీమియం కారు వాలే కనిపిస్తుంది. అలాగే వెనుక భాగంలో టెయిల్ లాంప్స్ కూడా కారుకు అందాన్ని తీసుకువస్తాయి. సూక్ష్మంగా ఉండే క్రోమ్ గ్రిల్ లేటెస్ట్ లుక్ తో కనిపిస్తుంది.

ఈ కారులో 1.3 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ నగరాల్లో ప్రయాణించే వారితోపాటు లాంగ్ జర్నీ చేసే వారికి అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి సౌండ్ రాకుండా సాఫీగా ప్రయాణం చేయవచ్చు. ఇది మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ పై లీటర్ ఇంధనానికి 24 కిలోమీటర్ల మైలేజ్ పొందవచ్చు. దీంతో ప్రతిరోజూ ప్రయాణించే వారితో పాటు విహారయాత్రలకు వెళ్లే వారికి ఈ మైలేజ్ సహాయపడుతుంది. ఇంధనా ఖర్చులు పొదుపు చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు అమర్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన డ్యాష్బోర్డ్ లో పెద్ద స్క్రీన్ ఉండనుంది. దీనితోపాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే కూడా చూడవచ్చు. డ్రైవర్ కు స్పష్టమైన సమాచారాన్ని అందించేలా నావిగేషన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటివి సౌకర్యాన్ని ఇస్తాయి. 2026 సంవత్సరంలో మార్కెట్లోకి రాబోయే ఈ కారు ధర రూ. 7.89 లక్షల ప్రారంభ ధర నుంచి ఉండనుంది. ప్రస్తుత కాలంలో అత్యధిక మైలేజ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular