CSK : ఈ సీజన్ అత్యంత ఉత్కంఠ గా సాగుతోంది.. ముఖ్యంగా గతంలో ఛాంపియన్లు గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మినహా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లు టాప్ -4 స్థానాల్లో లేవు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 9వ స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు గత శనివారం పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారీ తేడాతో గెలిచింది. అయినప్పటికీ ఆ జట్టు 9వ స్థానంలో కొనసాగుతోంది.. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించినప్పుడు హైదరాబాద్ ఎనిమిదో స్థానంలోకి వెళ్ళింది. ఆ తర్వాత ముంబై కూడా ఢిల్లీ పై గెలవడంతో.. ముంబై జట్టు ఏడవ స్థానానికి, రాజస్థాన్ రాయల్స్ ఎనిమిదవ స్థానానికి, హైదరాబాద్ జట్టు 9వ స్థానానికి పడిపోయింది. ఇక లక్నోపై గెలిచినప్పటికీ చెన్నై జట్టు పదోవ స్థానంలోనే కొనసాగుతోంది. ఎందుకంటే చెన్నై జట్టు ఏడు మ్యాచ్లు ఆడి, కేవలం రెండు మాత్రమే గెలిచింది..నెట్ రన్ రేట్ -1.276 ఉండడం చెన్నై జట్టుకు అతిపెద్ద శాపంగా మారింది..
Also Read : మహేంద్ర సింగ్ ధోని.. 43 ఏళ్ల వయసులో ఈ రికార్డులేంటి తలా?!
మిగతా జట్ల పరిస్థితి ఏంటంటే
హైదరాబాద్ జట్టు ఆరు మ్యాచులు ఆడి.. రెండు గెలిచింది. నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆరు మ్యాచులు ఆడి.. రెండిట్లో గెలిచింది.. నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.
ముంబై ఇండియన్స్ ఆరు మ్యాచులు ఆడి.. రెండిట్లో విజయం సాధించింది. నాలుగు పాయింట్లతో ఏడవ స్థానంలో ఉంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఐదు మ్యాచ్లు ఆడి.. మూడు విజయాలతో 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆరు మ్యాచులు ఆడి.. మూడు విజయాలతో ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ ఏడు మ్యాచ్లు ఆడి నాలుగు విజయాలతో 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరు మ్యాచ్లు ఆడి.. నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మ్యాచ్లు ఆడి.. నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి రెండవ స్థానంలో ఉంది.
గుజరాత్ టైటాన్స్ ఆరు మ్యాచ్లు ఆడి నాలుగింట్లో విజయం సాధించింది. 8 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
Also Read : ధోనికి ఏమైంది.. వెలుగులోకి సంచలన వీడియో..