Jio Offer
Jio : ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కోట్లాది మంది యూజర్ల కోసం జియో అన్‌లిమిటెడ్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద జియో యూజర్లకు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. ముకేష్ అంబానీ నుండి 50 రోజుల ఉచిత సేవను ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది? 50 రోజుల ఉచిత సేవతో పాటు ఇతర ప్రయోజనాలు ఏమిటో ఈ కథనంలో చూద్దాం.
Also Read : ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌లు: సాధారణ ఫోన్ల కంటే బెటరా?
ఆఫర్ ప్రయోజనాలు
జియో అన్‌లిమిటెడ్ ఆఫర్ రూ. 299, అంతకంటే ఎక్కువ ప్లాన్‌లతో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా, 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ప్రీమియం, 50 రోజుల పాటు ఉచిత జియో ఫైబర్/జియో ఎయిర్‌ఫైబర్ ట్రయల్ అందిస్తోంది. జియో హాట్‌స్టార్‌ను మొబైల్, టీవీలో 4K క్వాలిటీతో యాక్సెస్ చేయవచ్చు.
50 రోజుల ట్రయల్‌లో 800 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు, 11 కంటే ఎక్కువ OTT యాప్‌లు, అన్‌లిమిటెడ్ Wi-Fi ప్రయోజనాలు ఉన్నాయి.
ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది?
రిలయన్స్ జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఆఫర్ పొందడానికి ఏప్రిల్ 15 లాస్ట్ డేట్. ఈ రోజు మీరు ఈ ఛాన్స్ వాడుకుంటే 50 రోజుల ఫ్రీ ట్రయల్ బెనిఫిట్ వస్తుంది. ఈ ఆఫర్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే దగ్గరలోని జియో స్టోర్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు.
ఇతర ఆఫ్షన్స్
ఈ రోజు ఏ కారణం చేతనైనా ఈ ఆఫర్ వాడలేకపోతే, 100 రూపాయలకు 90 రోజుల పాటు ఫ్రీ జియో హాట్‌స్టార్ బెనిఫిట్ పొందొచ్చు. ఈ ధరలో మొబైల్‌లోనే కాదు, టీవీలో కూడా హాట్‌స్టార్ వస్తుంది.
Also Read : రూ.599లకే ఇంతా?.. డేటా, కాలింగ్, ఓటీటీ, లైవ్ టీవీ అన్నీ!
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Jio reliance jio launches 50 days of free service for users
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com