murderd
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. మొహమ్మద్ ఆరిఫ్ మోమినిద్దిన్ అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. పదేళ్ల కిందట అమెరికా వెళ్లిన ఆరిఫ్ జార్జియాలో ఓ కిరాణా దుకాణం నడిపిస్తున్నాడు. అయితే ఆయన ఒంటిగానే అక్కడ జీవిస్తున్నాడు. ఆయన హత్య జరిగిన తరువాత సమీపంలో బంధువులు ఎవరూ లేరని అందువల్ల తమకు అమెరికా వెళ్లడానికి వీసా ఇప్పించాలని ఆరిఫ్ భార్య ఫాతిమా , కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు తెలంగాణకు చెందిన మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ సైతం వీసా కోసం కేంద్ర మంత్రి జయశంకర్‌కు విజ్ఞప్తి చేసింది. ఆరిప్ హత్య జరిగిన తరువాత అయన కుటంబంలో విషాదం నింపింది.