Microsoft : మైక్రోసాఫ్ట్‌ను పెద్దఎత్తున వీడుతున్న మహిళా ఉద్యోగులు.. కారణం ఇదే..

సాఫ్ట్‌వేర్‌ రంగం ఇప్పుడు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఓ దిగ్గజ కంపెనీ నుంచి మహిళా ఉద్యోగులు స్వచ్ఛందంగా వీడుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : October 24, 2024 3:58 pm

Microsoft

Follow us on

Microsoft : సాఫ్ట్‌వేర్‌ రంగం ప్రస్తుతం కొన్నేళ్లుగా ఒడిదుడుకులకు లోనవుతోంది. కరోనా తర్వాత ఆర్థిక సంక్షోభం చిన్న కంపెనీలతోపాటు పెద్ద సంస్థలకు కూడా ఇబ్బందిగా మారింది. ద్రవ్యోల్బణం కారణంగా అనేక కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇంకా తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. నైపుణ్యం తక్కువగా ఉన్న ఉద్యోగులను పక్కన పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. ప్రముఖ కంపెనీలు కూడా ఉద్యోగుల తగ్గిపునకే మొగ్గు చూపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్తితి ఉంది. ఇక కొత్త రిక్రూట్‌మెంట్‌ కూడా బాగా తగ్గింది. కొత్త వారికి ఇచ్చే వేతనాలను కూడా కంపెనీలు బాగా తగ్గించాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ సంస్థ తమ ఉద్యోగులను కాపాడుకునేందుకు ఇబ్బంది పడుతోంది. ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు సంస్థను వీడుతున్నారు. నెలనెలా రాజీనామా చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు, నల్లజాతీయులు, లాటినిక్స్‌లు కంపెనీని వీడుతున్నారు. సంస్థకు చెందిన డైవర్సిటీ అండ్‌ ఇంక్లూజన్‌ రిపోర్టు బుధవారం విడుదలైంది. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి.

మహిళలే ఎక్కువ..
మైక్రోసాఫ్ట్‌ కంపెనీని ఈ ఏడాది జూన్‌ నాటికి చాలా మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. రాజీనామా చేసినవారిలో 32.7 శాతం మంది మహిళలే ఉండడం గమనార్హం. గతేడాది 31 శాతంతో పోలిస్తే రాజీనామాలు స్వల్పంగా పెరిగాయి. నల్లజాతీయుల రాజీనామాలు 8.7 శాతం నుంచి 10 శాతానికి పెరిగాయి. లాటినిక్స్‌ రాజీనామాలు 8 శాతం నుంచి 9.8 శాతానికి పెరిగాయి. పోటీ సంస్థలు మంచి ఆఫర్లు ఇవ్వడం, ఆన్‌లైన్‌ రీటైన్‌ వ్యాపారరంగంలోకి మారడం వంటి కారణాలతో ఎక్కువ మంది ఉద్యోగులు సంస్థను వీడుతున్నట్లు భావిస్తున్నారు. ప్రాతినిధ్యం లేని వివిధ వర్గాల ప్రజలను నియమించుకోవడం కారణంగా కూడా రాజీనామాలు పెరుగుతున్నాయని డైవర్సిటీ అధికారి లిండ్సే రే మైక్‌ ఇంటైర్‌ వెల్లడించారు. ఇలా నియమింతులైన వారికి కెరీర్‌ ఆప్షన్లు ఇస్తామని తెలిపారు.

క్లౌడ్‌ రంగంలో వృద్ధి..
ఇదిలా ఉంటే.. మైక్రోసాఫ్ట్‌ సంస్థ క్లౌడ్‌ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తరిస్తోంది. దీంతో వివిధ వర్గాలకు చెందిన ప్రజలను నియమించుకునే అవకాశం లభిస్తోంది. ఉద్యోగుల్లో వైవిధ్యం సంస్థ చేపట్టే ఏఐ ప్రాజెక్టులకు చాలా ముఖ్యం. జాతి, లింగ వివక్ష లేకుండా ఉంటేనే ప్రాజెక్టులను విజయవంతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది.