Pushpa 2 Postponed: మరోసారి వాయిదా పడిన ‘పుష్ప 2 : ది రూల్’..అధికారిక ప్రకటన చేసిన నిర్మాతలు..కారణాలు ఇవే!

ఈ సందర్భంగా మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ని విడుదల చేయగా, కాసేపటి క్రితమే అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ లో ఈ పోస్టర్ తో ట్వీట్ వేసాడు. ఇదంతా పక్కన పెడితే ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ పై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ ప్రెస్ మీట్ కి అల్లు అర్జున్ కూడా వస్తాడని, పుష్ప 2 గురించి విశేషాలు మాత్రమే కాకుండా, గడిచిన నాలుగు నెలల్లో సోషల్ మీడియా లో జరుగుతున్న వివాదాలపై స్పందిస్తాడని, గొడవలకు చెక్ పెడతాడని అందరూ భావించారు.

Written By: Vicky, Updated On : October 24, 2024 4:03 pm

Pushpa 2 Postponed

Follow us on

Pushpa 2 Postponed: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప : ది రూల్’ కోసం అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. కేవలం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు, కోలీవుడ్ , బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పుష్ప చిత్రం అన్ని భాషల్లో గ్రాండ్ హిట్ అవ్వడం వల్లే ఈ సినిమాకి ఇంతటి క్రేజ్ ఏర్పడింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాని ఆగస్టు 15వ తారీఖు నుండి, డిసెంబర్ 6వ తేదికి వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నేడు ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న కాకుండా, డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు.

ఈ సందర్భంగా మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ని విడుదల చేయగా, కాసేపటి క్రితమే అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ లో ఈ పోస్టర్ తో ట్వీట్ వేసాడు. ఇదంతా పక్కన పెడితే ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ పై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ ప్రెస్ మీట్ కి అల్లు అర్జున్ కూడా వస్తాడని, పుష్ప 2 గురించి విశేషాలు మాత్రమే కాకుండా, గడిచిన నాలుగు నెలల్లో సోషల్ మీడియా లో జరుగుతున్న వివాదాలపై స్పందిస్తాడని, గొడవలకు చెక్ పెడతాడని అందరూ భావించారు. కానీ అల్లు అర్జున్ లేకుండా, కేవలం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని భారీ లెవెల్ లో విడుదల చేస్తామని, ప్రతీ భాషలోనూ రికార్డు కొట్టేలా ప్లాన్ చేస్తున్నామని, ముందు రోజు రాత్రి నుండే షోస్ మొదలు అవుతాయని చెప్పుకొచ్చారు. ఇలా ఎంతసేపు విడుదల ప్లానింగ్ ఎలా ఉండబోతుందో చెప్పి బోర్ కొట్టించేసారు. ఇది ఇలా ఉండగా పుష్ప 2 చిత్రం విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ వేట మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ కలిపి సుమారుగా 1200 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగినట్టు చెప్తున్నారు.

తెలుగు లో ఈ చిత్రానికి ఎంత క్రేజ్ ఉందో, హిందీలో అంతకు మించిన క్రేజ్ ఉంది. ఈ సినిమా విడుదలయ్యే పక్క రోజు ‘చావా’ అనే భారీ బడ్జెట్ బాలీవుడ్ చిత్రం విడుదల కాబోతుంది. ఛత్రపతి మహారాజ్ కొడుకు జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించి ఈ సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటించాడు. అయితే అక్కడి బయ్యర్స్ మాత్రం ఎక్కువగా పుష్ప 2 చిత్రం మీదనే అమితాసక్తిని చూపిస్తున్నారు. నార్త్ ఇండియా లో ఉండే సింగిల్ స్క్రీన్స్ మొత్తం వారం రోజుల వరకు పుష్ప 2 ప్రదర్శన కోసం ఒప్పందాలు కుదిరించుకున్నారట. ఆ స్థాయిలో ఈ సినిమా క్రేజ్ అటు జనాల్లోనూ, ఇటు ట్రేడ్ లోనూ ఉంది. విడుదలకు ముందే ఈ రేంజ్ సునామీ ని తలపిస్తున్న ఈ చిత్రం, విడుదల తర్వాత ఇక ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.