Sunita Williams : అమెరికాకు చెందిన ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏవియేషన్, స్సేస్ టెక్ రంగాల్లో ఇప్పటికే అపఖ్యాతి మూటగట్టుకున్న కంపెనీకి తాజగా మరో సమస్య ఎదురైంది. స్సేస్ టñ క్నాలజీ రంగంలో ఎలాన్ మస్కకు చెందని స్పేస్ ఎక్స్‌కు దీటుగా తయారు చేసిన స్టార్ లైనర్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి రావడం కష్టంగా మారింది. స్పేస్ స్టేషన్‌కు బయల్దేరిన సమయంలోనే వాహక నౌకలో సమస్యలు తలెత్తాయి. వాహనం నుంచి హీలియం లీక్ అయినట్లు అందులో ప్రయాణిస్తున్న భారత సంతతికి చెందిన వ్యోమగామిన సునీతా విలిమయ్స్, మరో వ్యోమగామాని బూచ్ విల్‌మెల్ గుర్తించారు. అయితే వాహనంలో హీలియం నిల్వలు ఎక్కువగా ఉన్నందున ప్రమాదం లేదని నాసా అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు క్షేమంగా చేరుకున్నారు.
తిరిగి రావడంలో జాప్యం…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతావిలియమ్స్, బుచ్ విల్మెల్ షెడ్యూల్ ప్రకారం జూలై 2న తిరిగి రావాల్సి ఉంది. కానీ, బోయింగ్ సంస్థకు చెందిన వ్యోమ నౌక స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలతో వారు భూమికి తిరిగి రాలేకపోతున్నారు. నాసా ఎంత ప్రయత్నించినా స్టార్‌లైనర్‌లో సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో ఇద్దరు వ్యోమగాములు భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యం అవుతోంది.
స్పేస్ ఎక్స్‌వైపు నాసా చూపు..
ఈ క్రమంలో ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకు వచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్ కోసం ప్రయత్నిస్తోంది. ఈమేరకు స్పేస్ ఎక్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈ విషయం బయటకు తెలియనివ్వడం లేదు. గత మార్చిలో నలుగురు వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లిన క్రూ డ్రాగన్ ప్రస్తుతం అంతరిక్షంలోనే ఉంది. దీనిలో నలుగురికన్నా ఎక్కువ మందిని తీసుకువచ్చే అవకాశం ఉంది. స్టార్ లైనర్ మరమ్మతులు త్వరగా పూర్తి కాకపోతే క్రూ డ్రాగన్‌లో సునీత, బుజ్ విల్‌మిల్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే వ్యోమగాముల ప్రయాణానికి సంబంధించి బోయింగ్‌పై మస్క్ స్పేస్ ఎక్స్ పైచేయి సాధించినట్లవుతుంది.