Vandebharat Sleeper Train : వస్తోంది వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. ప్రత్యేకతలు తెలుసా?

Vandebharat Sleeper Train : రెండు నెలల్లో వందేభారత్‌ రైలు పట్టాలెక్కుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల తెలిపారు. బీహెచ్‌ఎంఎల్‌ లిమిటెడ్‌ ద్వారా దీనిని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

Written By: NARESH, Updated On : June 26, 2024 10:34 pm

Vandebharat Sleeper Train

Follow us on

Vandebharat Sleeper Train : మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా తయారు చేసిన వందే భారత్‌ రైళ్లు ఇప్పటికే పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఈ ప్రాజెక్టు సక్సెస్‌ కావడంతో భారత రైల్వే ఇప్పడు వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను పట్టాలపైకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాదే వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తోంది. 2024 ఆగస్టు 15న వందే భారత్‌ స్లీపర్‌ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహించే అవకాశం ఉంది. మొదటి రైలును ఎక్కువ రద్దీగా ఉండే ఢిల్లీ–ముంబై మార్గంలో నడిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

గుజరాత్‌ మీదుగా…
ఇండియన్‌ టెక్‌ – ఇన్‌ఫ్రా తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసిన సమాచారం ప్రకారం.. ఆగస్టు 15న తొలి వందేభారత్‌ స్లీపర్‌ చైలు పట్టాలు ఎక్కబోతోంది. ఈ రైలు మొదట గుజరాత్‌ మీదుగా ఢిల్లీ, ముంబై మధ్య పరుగులు పెట్టనుంది.

బెంగళూర్‌లో తయారీ..
వందే భారత్‌ స్లీపర్‌ రైలు కోచ్‌లను బెంగళూరులో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయని తెలుస్తోంది. వాటిలో 10 థర్డ్‌ ఏసీకి, 4 సెకండ్‌ ఏసీకి, ఒక కోచ్‌ ఫస్ట్‌ ఏసీ ఉంటాయని సమాచారం. రైలులో రెండు సీటింగ్‌ కమ్‌ లగేజ్‌ రేక్‌ కోచ్‌లు కూడా ఉంటాయి.

130 కి.మీ వేగంతో..
మొదటి దశలో వందేభారత్‌ స్లీపర్‌ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచేలా కసరత్తుచేస్తున్నారు. తర్వాత ఈ వేగాన్ని గంటకు 160 కి.మీ నుంచి 220 కి.మీకి పెంచాలని భావిస్తున్నారు. రెండు నెలల్లో వందేభారత్‌ రైలు పట్టాలెక్కుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల తెలిపారు. బీహెచ్‌ఎంఎల్‌ లిమిటెడ్‌ ద్వారా దీనిని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.