https://oktelugu.com/

PM Modi : పార్లమెంట్‌లో ఇద్దరు ప్రత్యేక అతిథులను కలిసిన మోదీ.. ఎవరో తెలుసా.. వైరల్‌ వీడియో

PM Modi దత్తాత్రేయ మనుమరాళ్లిద్దరూ ప్రధాని మోదీని కలవాలని కోరారు. దీంతో తాతయ్య దత్తాత్రేయ వారిని తీసుకుని బుధవారం పార్లమెంట్‌ భవన్‌కు వచ్చారు. ఇద్దరూ మోదీని చూడగానే గులాబీ పూలు ఇచ్చారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 26, 2024 / 10:25 PM IST

    Prime Minister Narendra Modi

    Follow us on

    PM Modi : భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం(జూన్‌ 26న) పార్లమెంటులోని తన కార్యాలయంలో ఇద్దరు ప్రత్యేక అతిథులను కలిశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీని కలిసింది ఇద్దరు కవల బాలికలు. లిలక్‌ ఫ్రాక్స్‌లో ఉన్న అమ్మాయిలు దేశభక్తి గీతంతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని పిల్లలపై తనకున్న ఆప్యాయతను చాటుకున్నారు. బాలికలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

    ఎవరీ బాలికలు..
    పార్లమెంట్‌లోని ప్రధాన కార్యాలయంలోకి వచ్చిన ఈ ఇద్దరు బాలికలు హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మనుమరాళ్లు. దత్తాత్రేయ కూతురు పిల్లలు. ఇద్దరూ కవలలు. వారిని చూడగానే ప్రధాని మోదీ ముఖం వెలిగిపోయింది. ఈ సందర్భంగా ఇద్దరు అతిథులు ప్రధానిపై తాము రాసిన కవితను వినిపించారు.

    చిన్నారుల కోరిక మేరకు..
    దత్తాత్రేయ మనుమరాళ్లిద్దరూ ప్రధాని మోదీని కలవాలని కోరారు. దీంతో తాతయ్య దత్తాత్రేయ వారిని తీసుకుని బుధవారం పార్లమెంట్‌ భవన్‌కు వచ్చారు. ఇద్దరూ మోదీని చూడగానే గులాబీ పూలు ఇచ్చారు. ప్రధాని మోదీ కూడా దత్తాత్రేయకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు కవిత చెప్పడం ప్రారంభించారు. ఆ కవిత వింటూ ప్రధాని మోదీ వారిని తన దగ్గరకు పిలిచి లాలించారు. ఆ అమ్మాయిలిద్దరికీ చాక్లెట్లు కూడా ఇచ్చారు. దీంతో చిన్నారులు కూడా చాలా సంతోషంగా కనిపించారు.