HomeతెలంగాణHyderabad Steel Bridge Construction Danger: పైనున్న వారి ప్రాణాలు గాలిలో.. కింద ఉన్న వారి...

Hyderabad Steel Bridge Construction Danger: పైనున్న వారి ప్రాణాలు గాలిలో.. కింద ఉన్న వారి భద్రత ప్రమాదంలో..ఒళ్ళు గగుర్పొడిచే వీడియో!

Hyderabad Steel Bridge Construction Danger: ఆ వీడియో చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది. మామూలుగా కాదు.. అసలు అలా ఎలా పనిచేస్తారు? పని చేయించే కాంట్రాక్టర్ కు బుద్ధి లేదా.. పనిచేసే వాళ్లకు భయం లేదా.. జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత? పైగా అదేమైనా మామూలు రోడ్డు కాదు కదా.. నిత్యం వేలాది వాహనాలు వెళుతూ ఉంటాయి. అలాంటి రోడ్డుమీద పనులు చేయడమే ఒక సాహసం అనుకుంటే.. ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా పనులు చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

హైదరాబాదులోని సంతోషనగర్ ప్రాంతంలో స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణానికి గతంలోనే అనుమతులు వచ్చాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. ఇతర వ్యవహారాల వల్ల పనులు ఇన్ని రోజులపాటు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేసింది. తద్వారా ఇటీవల కాలం నుంచి పనులలో వేగం పెరిగింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కార్మికులతో బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. పనులు జరిపిస్తున్న తీరు ఆందోళనకారంగా ఉంది. దానికి సంబంధించిన వీడియోలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

సంతోష్ నగర్ ప్రాంతంలో స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తున్న ఏరియాలో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఈ ప్రాంతం మీదుగా వాహనాలు విపరీతంగా వెళుతూ ఉంటాయి. ప్రతిరోజు ఎంత లేదనుకున్నా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలంటే ట్రాఫిక్ డైవర్షన్ కు అవకాశం లేదు. పైగా ఆ రోడ్డు కూడా చిన్నగా ఉంటుంది. అలాంటప్పుడు రాత్రిపూట పనులు జరిగితే బాగుంటుంది. కానీ ఈ విషయాన్ని కాంట్రాక్టర్ మర్చిపోయారు. అంతేకాదు, ఏ మాత్రం పట్టించుకోకుండా పగటిపూట కూడా కార్మికులతో పనులు చేస్తున్నారు. ఆ పనులు జరిపిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉంది. పనులు చేస్తున్న కార్మికులకు ఏమాత్రం భద్రత లేదు. ఒకరకంగా వారి ప్రాణాలు గాలిలో ఉన్నట్టు లెక్క.

బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఇనుప దిమ్మెలను కార్మికులు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ వారు గనక స్లిప్ అయితే ప్రాణాలు పోవడం గ్యారెంటీ. ఆ వీడియో చూస్తున్న మనకే కళ్ళు తిరుగుతున్నాయి అంటే.. ఇక కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కార్మికుల భద్రత విషయంలో కాంట్రాక్టర్ ఏమాత్రం నిబంధనలు పాటించడం లేదు. దీనికి తోడు కింది రోడ్డు మీద జనాలు వాహనాల్లో వెళ్తూనే ఉన్నారు. పొరపాటున పైన పనులు చేస్తున్న కార్మికుల చేతుల నుంచి ఇనుప దిమ్మెలు జారిపడితే.. కింద రోడ్డు మీద వెళ్లే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper
Exit mobile version