Homeక్రీడలుక్రికెట్‌RCB Fan Viral Video: ఆర్సీబీ జట్టే కాదు.. అభిమానులకూ ఓ రేంజ్ ఉంటుంది.. వైరల్...

RCB Fan Viral Video: ఆర్సీబీ జట్టే కాదు.. అభిమానులకూ ఓ రేంజ్ ఉంటుంది.. వైరల్ వీడియో

RCB Fan Viral Video: ఐపీఎల్ లో అత్యధిక సార్లు ట్రోఫీలు సాధించిన జట్లుగా ముంబై, చెన్నై కొనసాగుతున్నాయి. ఈ రెండు జట్లకు విపరీతమైన అభిమానుల బలం ఉంటుంది. ఈ రెండిటిని మించే విధంగా బెంగళూరు ఉంటుంది. బెంగళూరు గత సీజన్లో విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టు ను ఓడించి ట్రోఫీని అందుకుంది.

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

ఇన్ని సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు అనేక పర్యాయాలు ఫైనల్ వెళ్లినప్పటికీ ట్రోఫీని అందుకోలేకపోయింది. ఫైనల్ లో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఓటమిపాలయ్యేది. కానీ ఈసారి అలా జరగలేదు. ఎందుకంటే బెంగళూరు ఈసారి ఒత్తిడిని జయించింది. విజేతగా ఆవిర్భవించింది. విజేతగా నిలిచిన తర్వాత బెంగళూరు సరికొత్త చరిత్రను సృష్టించింది. తన జట్టు విలువను మరింత పెంచుకుంది.

బెంగళూరు జట్టుకు సంబంధించి ప్రతిరోజు కొత్త కొత్త అప్డేట్స్ వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈసారి బెంగళూరు జట్టు గురించి కాకుండా.. బెంగళూరు అభిమానుల గురించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.

ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ వెళ్ళిపోయింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా కూడా సెమీ ఫైనల్ వెళ్లిపోయాయి. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా సెమి ఫైనల్లో తలపడబోతున్నాయి. టీమిండియా, ఇంగ్లాండ్ సెమీఫైనల్ లో పోటీ పడతాయి.

ముంబై వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే రెండు జట్ల ఆటగాళ్లు అత్యంత సీరియస్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు ఆటగాడు సాల్ట్ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బెంగళూరు అభిమాని సాల్ట్ ను కలవడానికి మైదానానికి వచ్చాడు. వచ్చిన ఆ అభిమాని వయసు కేవలం పది నుంచి 11 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఆ అభిమాని చేయి ఊపి కలవాలి అని సంకేతం ఇవ్వడంతో సాల్ట్ పరుగున వచ్చాడు. తన ప్రాక్టీస్ మధ్యలోనే వదిలిపెట్టి ఆ బుడ్డ అభిమానిని కలిశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ లో ఉంది. బెంగళూరు జట్టు మాత్రమే కాదు.. బెంగళూరు అభిమానులకు కూడా ఒక రేంజ్ ఉంటుందని.. దానిని ఈ సంఘటన నిరూపిస్తోందని నెటిజన్లు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version