Motorola Edge 70 Max : ప్రముఖ మొబైల్ కంపెనీ మోటరోలా కొత్త మొబైల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఎన్నో రకాల మోడల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కొత్త ఫోన్ మరిన్నీ అద్భుతమైన ఫీచర్లను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది మోటో అభిమానులు ఈ ఫోన్ ను కొనడానికి ఎగబడుతున్నారు. ఇంతకీ ఈ ఫోన్ లో ఉన్న ఫీచర్లు ఏంటీ? ఇది ఎందులో స్పెషల్?
మోటరోలా ఎడ్జ్ నుంచి 70 మ్యాక్స్ ఈ ఏడాది జూలైలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇటీవల దీని గురించి ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. ఈ ఫోన్ లో 6.7 అంగుళాల ఏమోల్డ్ డిస్ ప్లే ఉంది. ఇది 144 హెచ్ జడ్ రిఫ్రెష్ మెంట్ తో పనిచేస్తుంది. దీంతో స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. అలాగే గేమింగ్ కోరుకునేవారికి కూడా అనుగుణంగా ఉంటుంది. ఇందులో అత్యధిక పీక్ బ్రైట్నెస్ ఉండడంతో ఎండలో కూడా స్పష్టంగా స్క్రీన్ కనిపిస్తుంది. అలాగే ఇందులో ఐపీ 68 రేటింగ్ ఉండడంతో వాటర్ రెసిస్టెన్స్ తో పాటు దుమ్ము ధూళి నుంచి రక్షణగా ఉంటుంది.
ఈ మొబైల్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ లెటేస్ట్ ప్రాసెసర్ ఉండనుంది. దీంతో భారీ గేమింగ్ కోరుకున్నా.. ఇది అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా మల్టీ టాస్కింగ్ తో పనిచేసేవారికి కూడా సపోర్ట్ గా ఉంటుంది. ఇందులో మై ఎక్స్ అనే క్లీన్ అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తుంది. దీంతో ఎలాంటి బ్లోట్ వేర్ యాప్ లు లేకున్నా కూడా ఇంటర్ ఫేస్ చాలా స్మూత్ గా ఉంటుంది.
ప్రతి ఫోన్ లో కోరుకునేది బెస్ట్ కెమెరానే. ఇందులో కూడా 50 మెగాపిక్సెల్ తో కూడిన కెమెరాను అందించారు. దీంతో పాటు టెలిఫోటో కోసం కూడా అంతేస్థాయిలో కెమెరా పనిచేయనుంది. ఫ్రంట్ కెమెరా సైతం 50 ఎంపీతో పనిచేస్తుంది. ఇక ఇందులో 4 కే వీడియో రికార్డింగ్ కు ఆప్షన్ ఉంది. రాత్రి సమయంలోనూ అద్భుతమైన ఫొటోలను ఈ ఫోన్ తో పొందే అవకాశం ఉంటుంది.
బ్యాటరీ వినియోగంలో ఈ ఫోన్ యూజర్లకు సపోర్టుగా ఉండనుంది. ఎందుకంటే ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని చేర్చారు. ఇది మిగతా ఫోన్ల కంటే తక్కువే అయినప్పటికీ సాధారణ యూజర్స్ కు అనుగుణంగా ఉంటుంది. ఈ బ్యాటరీ 125 వాట్ సపోర్ట్ చేయనుంది. దీంతో కొద్ది నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉవంది. అలాగే 50 వాట్ వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ సదుపాయం కూడా ఇందులో ఉంది.