Motorola Edge 70 Max: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Motorola కంపెనీ తనదైన ముద్ర వేసుకుంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఆకట్టుకునే మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే లేటేస్ట్ గా ప్రీమియం సెగ్మెంట్లో మరో సంచలనానికి తెరలేపింది. మోటోరోలా ఎడ్జ్ 70 సిరీస్‌లో భాగంగా అత్యంత పవర్ఫుల్ ఫీచర్లతో Motorola Edge 70 Max మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ ఇప్పటికే లైవ్ అయింది. అయితే ఇందులో కొన్ని ఫీచర్లు, సౌకర్యాల గురించి తెలియడంతో యూత్ ఆగలేకపోతున్నారు. ఇంతకీ ఈ మొబైల్ ఎలా ఉంటుందంటే?
Motorola Edge 70 Max స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ ఇందులో ఉండే బ్యాటరీ. ఇందులో 8000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఉంచారు. అంతేకాకుండా ఈ బ్యాటరీ సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఫోన్ స్లిమ్‌గా ఉంటూనే, రెండు నుంచి మూడు రోజుల పాటు నిరంతరాయంగా బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. దీనికి తోడు, వైర్లెస్ పవర్ కన్సార్టియం (WPC) లిస్టింగ్ ప్రకారం.. ఆపిల్ మ్యాగ్‌సేఫ్ తరహాలోనే ఈ ఫోన్ Qi2 మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఫలితంగా ఎలాంటి వైర్ల ఇబ్బంది లేకుండా మాగ్నెటిక్ ఛార్జర్ల సాయంతో సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్‌లో అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్షిప్ చిప్సెట్ Qualcomm Snapdragon 8 Gen 5 ని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ ,గ్రాఫిక్స్ పనులకు బాగా ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టాస్క్‌ల కోసం ఈ ఫోన్లో ఒక డెడికేటెడ్ ‘Moto AI Key’ (బటన్) ను ఇస్తున్నారు. ఇది మునుపటి మోడళ్లతో పోలిస్తే 46 శాతం మెరుగైన ఎన్పియు పనితీరును అందిస్తూ, యూజర్లకు సరికొత్త AI అనుభూతిని పరిచయం చేయనుంది.
మోటోరో ఎడ్జ్ 70 సిరీస్‌లోని ఇతర మోడళ్లు కర్వ్డ్ డిస్ప్లేతో రాగా, ఈ ‘మ్యాక్స్’ వేరియంట్ మాత్రం క్లాసిక్ లుక్ ఇచ్చే ఫ్లాట్ AMOLED డిస్ప్లే తో ఉండనుంది. ఫ్లాట్ ప్యానెల్ సెంటర్ పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాతో విభిన్నంగా రానుంది. వెనుక భాగంలో స్టైలిష్ స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఫొటోగ్రఫీ లవర్స్ కోసం దీనిలో 200MP ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది.
