Instagram And WhatsApp: మొన్న ఫేస్ బుక్, నిన్న వాట్సాప్, ఇన్ స్టా.. నిమిషాల్లో సేవలు నిలిచిపోతే ఎంత నష్టమో తెలుసా?

ఫేస్ బుక్ సంగతి అలా ఉంటే.. దీని యాజమాన్యంలోని వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ సేవల్లో బుధవారం అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి సేవల్లో స్తబ్దత ఏర్పడడంతో అమెరికా నుంచి ఇండియా వరకు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 4, 2024 9:54 am

Instagram And WhatsApp

Follow us on

Instagram And WhatsApp: ఉదయం లేస్తే ఫేస్ బుక్ చూడనిదే దినచర్య ప్రారంభం కాదు..వాట్సాప్ వాడకుండా రోజు మొదలు కాదు. ఇన్ స్టా సర్ఫింగ్ చేయకుండా.. మనసు మనసులా ఉండదు.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా మనుషులంతా సోషల్ మీడియా యాప్స్ కు బానిసలయ్యారు. వాటిని చూడకుండా నిమిషం కూడా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. ఈ యాప్స్ కు సంబంధించి ఇటీవల తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి.. ఆ మధ్య ఫేస్ బుక్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో కొంతసేపు సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు గగ్గోలు పెట్టారు. ట్విట్టర్ లో మార్క్ జుకర్ బర్గ్ ను ఒక ఆట ఆడుకున్నారు. సమస్యను పరిష్కరించిన తర్వాత అతడు అదే ట్విట్టర్ వేదికగా స్పందించాడు. సేవల్లో అంతరాయం ఏర్పడినందుకు క్షమించాలని కోరాడు. ఆ వ్యవధిలోనే సేవలు నిలిచిపోయినందుకు ఫేస్ బుక్ వందల కోట్లు నష్టపోయిందని “రాయిటర్స్” నివేదించింది. అయితే సేవల్లో అంతరాయం ఎందుకు ఏర్పడిందనే విషయంపై ఫేస్ బుక్ యాజమాన్యం స్పష్టత ఇవ్వలేదు.

ఫేస్ బుక్ సంగతి అలా ఉంటే.. దీని యాజమాన్యంలోని వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ సేవల్లో బుధవారం అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి సేవల్లో స్తబ్దత ఏర్పడడంతో అమెరికా నుంచి ఇండియా వరకు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. భారతదేశంలో 30 వేలకు మందికి పైగా వినియోగదారులు వాట్సాప్ సేవలు నిలిచిపోయాయని.. ఇన్ స్టా గ్రామ్ లో అదే పరిస్థితి నెలకొందని వాపోయారు. ఆ సమయంలో తాము ఆ సోషల్ యాప్స్ ను వాడలేకపోయామని పేర్కొన్నారు. మెసేజ్, ఆడియో, వీడియో కాల్స్ చేయలేకపోయామని వివరించారు. సేవల్లో అంతరాయం వల్ల వాట్స్అప్ యాజమాన్యానికి 17,000 మంది వినియోగదారులు నేరుగా ఫిర్యాదులు చేశారు. డౌన్ డెటెక్టర్ నివేదిక ప్రకారం భారతదేశంలో 30 వేలమంది, ఇంగ్లాండ్ లో 67,000 మంది, బ్రెజిల్ దేశంలో 95,000 మంది వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో.. తమ ఫిర్యాదులను మెటా యాజమాన్యానికి నివేదించారు. అమెరికాలోని 3,200 మంది ఇన్ స్టా గ్రామ్ వాడడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఫిర్యాదులు చేశారు. ప్రపంచంలోనే పలు దేశాల నుంచి ఫిర్యాదులు రావడంతో వాట్సప్ యాజమాన్యం స్పందించింది. ” వివిధ దేశాల నుంచి సమస్యలను ఎదుర్కొంటున్నట్టు కొంతమంది మాకు ఫిర్యాదు చేశారు. ప్రతి ఒక్కరికి 100% సర్వీస్ అందించేందుకు మేము కృషి చేస్తున్నామని” ట్విట్టర్ ఎక్స్ లో ప్రకటించింది. గత ఏడాది ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్, థ్రెడ్ వంటి సోషల్ మీడియా యాప్స్ లోనూ ఇలాంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వినియోగదారులు చాలాసేపు వరకు వాటి సేవలను పొందలేకపోయారు. గత ఏడాది ఫేస్ బుక్ లో సాంకేతిక సమస్యల వల్ల సేవలు నిలిచిపోతే వందల కోట్లల్లో నష్టం వాటిల్లిందని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. వాటిల్లిన నష్టం ఎన్ని కోట్లనేది మాత్రం మెటా స్పష్టం చేయలేదు.

ఇక బుధవారం రాత్రి 11:22 నిమిషాల నుంచి వాట్సాప్ లో సమస్యలు ప్రారంభమయ్యాయి. 11: 37 నిమిషాల నుంచి 11: 52 నిమిషాల వరకు వాట్సప్ పనిచేయలేదు. సర్వర్ వేగంగా డౌన్ కావడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు..ఇన్ స్టా గ్రామ్ పరిస్థితి కూడా ఇలానే ఉండడంతో చాలామంది వాటి యాజమాన్యాలకు ఫిర్యాదులు చేశారు. Down detector నివేదిక ప్రకారం 70 శాతం మంది వినియోగదారులు వాట్సాప్ వాడకంలో సమస్యలు ఎదుర్కొన్నారు. 24 శాతం మంది సందేశాలు స్వీకరించడంలో ఇబ్బంది పడ్డారు. ఆరు శాతం మంది వినియోగదారులు వాట్సాప్ వెబ్ వినియోగించడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. సర్వర్ వేగంగా డౌన్ కావడం వల్లే ఈ సమస్య ఎదురయిందని తెలుస్తోంది. కేవలం 15 నిమిషాల వ్యవధిలో సేవలు నిలిచిపోవడంతో వాట్సప్ వినియోగదారులు నష్టపోయారని… ఆ సంస్థ కూడా కోట్లల్లో నష్టపోయిందని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది..ఇన్ స్టా గ్రామ్ ఉపయోగించడంలోనూ ఇవే సమస్యలు ఎదుర్కోవడంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ సోషల్ మెసేజింగ్ యాప్స్ సరిగా పనిచేయకపోవడంతో నెటిజన్లు మీమ్స్ రూపొందించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కొంతమంది నేరుగా వాటి యాజమాన్యాలకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుల అనంతరం వాట్సప్ యాజమాన్యం స్పందించింది. సేవలు నిలిచిపోయినందుకు చింతిస్తున్నామని.. సమస్యను గుర్తించి పరిష్కరించామని.. ఇప్పుడు నిరభ్యంతరంగా సేవలు పొందచ్చని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.