KKR Vs DC 2024: కోల్ కతా పై పంత్ విధ్వంసం.. మురిసిపోయి షారుఖ్ ఖాన్ ఏం చేశాడో తెలుసా? వీడియో

ఓడిపోయినప్పటికీ ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. వెంకటేష్ అయ్యర్ బౌలింగ్లో లెగ్ సైడ్ దిశగా పంత్ కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 4, 2024 10:35 am

KKR Vs DC 2024

Follow us on

KKR Vs DC 2024: విశాఖపట్నంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో కోల్ కతా జట్టు చేతిలో 106 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ.. ఢిల్లీ జట్టు ఆటగాడు రిషబ్ పంత్.. ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురై.. సుదీర్ఘకాలం ఆసుపత్రిలో చికిత్స పొంది.. మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన అతడు.. తన పూర్వఫామ్ ప్రదర్శిస్తున్నాడు. బుధవారం నాటి మ్యాచ్లో 25 బంతుల్లో 55 పరుగులు చేశాడు. నాలుగు ఫోర్లు, 5 సిక్స్ లతో సత్తా చాటాడు. డేవిడ్ వార్నర్, మార్ష్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ వంటి వారు నిరాశపరిచినప్పటికీ.. ట్రిస్టాన్ స్టబ్స్ తో కలిసి 5 వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. స్టబ్స్ కూడా 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్ లతో 54 పరుగులు చేసి సత్తా చాటాడు. అక్షర్ పటేల్, పోరెల్, మార్ష్ వంటి వారు డక్ ఔట్ కావడంతో ఢిల్లీ జట్టు 106 పరుగుల తేడాతో ఓడిపోయింది.

పంత్… వెంకటేష్ అయ్యర్ వేసిన 12వ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4, 4, 4 బాది ఏకంగా 28 పరుగులు సాధించాడు. 23 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఓవర్ లో తొలి బంతిని ఓవర్ షార్ట్ ఫైన్ లెగ్ దిశగా పంత్ ఫోర్ కొట్టాడు. రెండవ బంతిని లాంగ్ ఆఫ్ లో సిక్స్ గా మలిచాడు. మూడో బంతిని ఫ్లిక్ షాట్ తో ఓవర్ షార్ట్ ఫైన్ లెగ్ దిశగా సిక్స్ కొట్టాడు. నాలుగో బంతిని బ్యాక్ వార్డ్ పాయింట్ దిశగా బౌండరీ కొట్టాడు. ఐదవ బంతిని లెగ్ సైడ్, చివరి బంతిని డీప్ బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా బౌండరీ బాది.. మొత్తంగా 28 పరుగులు సాధించాడు.. అతడు ఇలా విధ్వంసకరమైన ప్రదర్శన చేయడంతో అభిమానులు అభినందిస్తున్నారు.

ఓడిపోయినప్పటికీ ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. వెంకటేష్ అయ్యర్ బౌలింగ్లో లెగ్ సైడ్ దిశగా పంత్ కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. బంతిని కొట్టిన తర్వాత రిషబ్ పంత్ కనీసం దానివైపు చూడను కూడా చూడలేదు.. వెంకటేష్ అయ్యర్ బంతిని వేయడమే ఆలస్యం.. పంత్ దానిని లెగ్ సైడ్ దిశగా కొట్టడంతో అమాంతం గాల్లో లేచి స్టాండ్స్ లో పడింది.. దాదాపు 170 మీటర్ల ఎత్తులో బంతి ఎగిరింది. రిషబ్ పంత్ భారీ సిక్సర్ కొట్టడంతో కోల్ కతా జట్టు యజమాని షారుక్ ఖాన్ చప్పట్లు కొట్టి అభినందించాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ ను ఐపీఎల్ నిర్వాహ కమిటీ ఎలక్ట్రిక్ ఫైయింగ్ బ్యాటింగ్ పురస్కారంతో సత్కరించింది. ఈ నేపథ్యంలో కోల్ కతా జట్టు యజమాని షారుక్ ఖాన్ పంత్ ను ప్రత్యేకంగా అభినందించారు. అద్భుతంగా బ్యాటింగ్ చేశావంటూ కొనియాడాడు. అతడి జుట్టును చేతిలోకి తీసుకొని ప్రేమగా నిమిరారు.” కోల్ కతా జట్టు మ్యాచ్ గెలిచి ఉండవచ్చు. కానీ రిషబ్ పంత్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఏకంగా షారుఖ్ ఖాన్ లాంటి వ్యక్తి అతని ఆటను అభినందించకుండా ఉండలేకపోయాడు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.