Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీGemini 3.1 flashlight: రాకెట్ వేగం.. అద్భుతమైన పనితీరు.. డెవలపర్ లకు పండగే పండుగ!

Gemini 3.1 flashlight: రాకెట్ వేగం.. అద్భుతమైన పనితీరు.. డెవలపర్ లకు పండగే పండుగ!

Gemini 3.1 flashlight: ఏ ముహూర్తం లో అయితే ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసిందో.. అప్పటినుంచి ఏఐ టెక్నాలజీ రంగంలో గేమ్ చేంజర్ అయిపోయింది. అన్ని రంగాలలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను వాడటం పరిపాటిగా మారిపోయింది. గూగుల్, మెటా, ట్విట్టర్, ఇలా అన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి వచ్చేసాయి.

గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్.. డేటా సెంటర్లలో తిరుగులేని శక్తిగా ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా అదే స్థాయిని అందుకోవాలని భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గూగుల్ ఇప్పటికే అనేక రకాలుగా ప్రయోగాలు చేసింది..ఇప్పుడు జెమిని 3.1 ఫ్లాష్ లైట్ పేరుతో మరో ఏఐ మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది హై స్పీడ్ జనరేటివ్ ఏఐ ని అత్యంత చవక ధరలోకి తీసుకొచ్చింది.

వేగవంతమైన పనితీరు
జెమిని త్రీ సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న మోడల్ గా జెమిని 3.1 ఫ్లాష్ లైట్ నిలుస్తుందని గూగుల్ చెబుతోంది. ఈ మోడల్ ధర ఒక మిలియన్ ఇన్పుట్ టోకెన్లకు 0.25 డాలర్లు, ఒక మిలియన్ అవుట్పుట్ టోకెన్లకు 1.50 డాలర్ల వద్ద అందుబాటులో ఉంటుందని గూగుల్ చెబుతోంది. జెమిని 3.1 ప్రో వంటి ఫ్లాగ్ షిప్ సిస్టంల కంటే తక్కువ స్థానంలో ఉంది. ఆర్టిఫిషల్ ఎనాలసిస్ బెంచ్ మార్క్ ఆధారంగా.. జెమిని 2.5 ఫ్లాష్ తో పోల్స్ చూస్తే 2.5 రెట్లు వేగవంతమైన పనితీరును అందిస్తుంది. 45% వేగవంతమైన ఔట్ పుట్ అందిస్తుంది.

అధిక ఫ్రీక్వెన్సీ, రియల్ టైం అప్లికేషన్ ను లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. సంపూర్ణ గరిష్ట సామర్థ్యం కంటే ఎక్కువగా ఇది ఫలితాలను అందిస్తుంది. ఈ మోడల్ హై ఎండ్ వాల్యూమ్ డెవలపర్ వర్క్ లోడ్ కు ఆప్టిమైజ్ చేసి ఉంది.

ప్రమాణాలు, సామర్ధ్యాలు
పబ్లిక్ లీడర్ బోర్డులలో జెమిని 3.1 ఫ్లాష్ లైట్ arena. ai లో 1432 Eio స్కోరును నమోదు చేస్తుంది. రీజనింగ్, మల్టీ మోడల్ పనుల కోసం తేలికపాటి టైర్ ఇందులో అందుబాటులో ఉంది. Google GP QA డైమండ్ బెంచ్ మార్క్ లో 86.9 శాతం, ఎంఎంఎంయూ ప్రో లో 76.8% స్కోరును నమోదు చేస్తుంది. దీనికి తక్కువ ధర ఉన్నప్పటికీ మునుపటి జెమిని 2.x మోడల్ కంటే ముందుంటుంది. ఇది టెక్స్ట్, మల్టీ మోడల్ ఇన్పుట్ లను సపోర్ట్ చేస్తుంది.

ఏఐ స్టూడియో, వెరిటెక్స్ ఏఐ లలో ఆలోచన స్థాయిలు అధికంగా ఉన్నాయి. ఇవి డెవలపర్లు ఇచ్చిన పనికి తార్కిక శక్తిని పెంచుతాయి. లాటిట్యూడ్, కార్ట్ వీల్, వెరింగ్ వంటి సంస్థల నుంచి మొదలుపెడితే డెవలపర్ల వరకు పెద్ద స్థాయి, సకిష్టమైన పని భారాలను తగ్గించుకోవడానికి జెమినీ 3.1 ఫ్లాష్ లైట్ ను ఉపయోగిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular