https://oktelugu.com/

Googleలో కనిపించే ఈ అద్భుతాల గురించి తెలుసా? వెంటనే తెలుసుకోండి..

ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ఫోన్ కీలకం అవుతుంది. అయితే కావాల్సిన సమాచారం కోసం ఫోన్ లో ఉన్న గూగుల్ ను సంప్రదిస్తాం. గూగుల్ లేకపోతే సమాచారం తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. గూగుల్ ద్వారా సమాచారం తెలుసుకోవడమే కాదు.. కొన్ని వింతలు కూడా చూడొచ్చు. ఒక్కోసారి ఇవి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 26, 2024 / 04:59 PM IST

    wonders found on Google

    Follow us on

    Google: నేటి కాలంలో ప్రతి పనిని టెక్నాలజీతో చేస్తున్నారు. సాధారణంగా చేయడం కంటే టెక్నిక్ గా చేయడం వల్ల పని సులభం అవుతుంది. అంతేకాకుండా సమర్థవంతంగా పూర్తవుతుంది. అందుకే ప్రతీ రంగం వారు సాంకేతికాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఏ రంగం వారైనా టెన్నాలజీని ఉపయోగించేందుకు మొబైల్ ను వాడుతున్నారు. అలాగే ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ఫోన్ కీలకం అవుతుంది. అయితే కావాల్సిన సమాచారం కోసం ఫోన్ లో ఉన్న గూగుల్ ను సంప్రదిస్తాం. గూగుల్ లేకపోతే సమాచారం తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. గూగుల్ ద్వారా సమాచారం తెలుసుకోవడమే కాదు.. కొన్ని వింతలు కూడా చూడొచ్చు. ఒక్కోసారి ఇవి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నమ్మలేని విధంగా ఉండే ఈ ఫీచర్ల గురించి ఒక్కసారి తెలుసుకోండి..

    Flip Coin:
    ఫ్లిప్ కాయిన్ అంటే ఏదైనా బిళ్లను తిరగేయడం. ఏదైనా గేమ్ ఆడే సమయంలో గానీ, క్రికెట్ ఆడే సమయంలో గాని టాస్ వేసేందుకు కాయిన్ ను ఉపయోగిస్తుంటాయి. ఇందులో ఎవరు ఏది కోరుకుంటే అది రాగానే వారికే ముందుగా అవకాశం ఇస్తాయి. అయితే చాలా సమయాల్లో చేతిలో కాయిన్  ఉండదు. దీంతో గూగుల్ ఉండే ఈ చిన్న ట్రిక్ తో టాస్ వేసుకోవచ్చు. Googleలోకి వెళ్లి  Flip Coin అని టైప్ చేయాలి.  ఆ తరువాత ఒక  బిల్ల మాదిరిగా పేజీ కనిపిస్తుంది. దీనిలో రెండు రకాలుగా చిత్రాలు ఉంటాయి. అందులో ఇద్దరు వేర్వేరుగా కోరుకోమని చెప్పాలి. ఆ తరువాత దానిని ఫ్లిప్ చేయాలి. అప్పుడు ఆ కాయిన్ తిరుగుతుంది. ఆ తరువాత కోరుకున్న వారికి అనుకున్నది వస్తే టాస్ గెలిచారని చెప్పాలి.

    Thanos Snap:
    ఒక్కోసారి ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు క్లీన్ అవుతుంది. డిస్ ప్లే ఉన్న పేజీ మొత్తం వెళ్లిపోతుంది. అయితే మనం కోరుకున్న విధంగా ఫేజీనీ క్లీన్ చేయడానికి గూగుల్ లోకి వెళ్లి Thanos Sanapఅని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ ఉన్న పేజీ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే అక్కడ కనిపించే అక్షరాలన్నీ మాయమై పోయతాయి. ఆ తరువాత ఫోన్ పై మరోసారి క్లిక్ చేయగానే తిరిగి యథా స్థితికి వస్తాయి.

    Katamari:
    ఫోన్ వాడినప్పుడు పైన కనిపించే కొన్ని వస్తువులు ఆటోమేటిక్ గా అంటేసుకుంటే భలే వింతగా ఉంటుంది. అయితే ఇలా జరగాలంటే గూగుల్ లోకి వెళ్లి Katamari అని టైప్ చేయాలి. ఇప్పడు ముందుగా వచ్చిన వెబ్ సైట్ పై క్లిక్ చేయగా ఒక బాల్ కనిపించే పేజీ డిస్ ప్లే అవుతుంది. దీనిని క్లిక్ చేసి రోటేట్ చేయగా.. అక్కడున్న వస్తువులన్నీ బాల్ కు అంటుకుంటాయి. ఆ తరువాత మరోసారి క్లిక్ చేయగా యథాస్థితికి వస్తాయి.

    Wizard of Oz Easter Egg:
    ఫోన్ వాడుతున్నప్పుడు ఒక్కసారి గా 360 డిగ్రీలోకి మారిపోతే ఎలా ఉంటుంది? అలా మారడానికి ఈ చిన్న పని చేయండి. గూగుల్ లోకి వెళ్లి Wizard of Oz Easter Egg అని టైప్ చేయండి. ఇప్పుడు ముందుగా కనిపించే వెబ్ సైట్ పై క్లిక్ చేయాలి. ఈ వెబ్ సైట్ పక్కన చెప్పులతో కూడిన బొమ్మ కనిపిస్తుంది. దీనిని క్లిక్ చేయగానే పేజీ మొత్తం 360 డిగ్రీల కోణంలో మారిపోతుంది.

    Tags