English: ప్రస్తుతం అంతా కంప్యూటర్ యుగం నడుస్తోంది. చాలా మంది సాంప్రదాయ పనులను పక్కనబెట్టి సాప్ట్ వేర్ సైడ్ కు వెళ్తున్నారు. ప్రతీ రంగంలో టెక్నాలజీ చొచ్చుకుపోతుండడంతో ఈ రంగంలో నైపుణ్యాలు కలిగిన యువత కోసం కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది యువత వీటిలో ఎంట్రీ ఇచ్చేందుకు సంసిద్ధం కావాలి. మరి ఇందులో అవకాశం రావాలంటే గతంలో లాగా కేవలం స్టడీ స్కిల్క్ ఉంటేనే సరిపోతుంది. అందులో వర్క్ చేయడానికి కావాల్సిన Communication Skills కావాల్సి ఉంటుంది. వీటిలో ప్రధానమైనది English నేర్చుకోవడం. ఇంగ్లీష్ ఫ్యూయెంట్ గా తెలిసిన వారికి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అవకాశాలు ఉంటాయి. అయితే దేశంలోని చాలా మంది ఇప్పటికీ ఈ విషయంలో పూర్ గానే ఉన్నారు. మరి ఇందు కోసం ఏం చేయాలి?
కొన్ని నెలల కిందటే Artificial Intelligence ఎంట్రీ ఇచ్చింది. దీంతో భవిష్యత్ లో ఈ రంగంలో నిపుణుల అవసరం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈ రంగంలో అడుపెట్టాలంటే ముందగా కావాల్సిన క్వాలిఫికేషన్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఎందుకంటే చాల విషయాల ఇంగ్లీష్ ఫార్మాట్ లోనే ఉండనున్నాయి. ఐటీ రంగంలోనే కాకుండా వైద్య రంగంలో రాణించాలని అనుకున్నా.. ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మెడికల్ ప్రిక్షిప్షన్ గురించి పూర్తిగా తెలియాలంటే ఆంగ్లం తప్పనిసరిగా ఉండాలి. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలని చాలా మందికి ఉంటుంది. ఇలాంటి వారికి ఆంగ్ల నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి.
అయితే ఇంగ్లీస్ గురించి పూర్తిగా తెలియాని దశాబ్దాలుగా కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. కానీ చాలా మంది ఈ విషయంలో వెనుకబడుతున్నారు. ముఖ్యంగా పేదవారు ఇంగ్లీష్ ను నేర్చుకోవడంలో వెనుకబడుతున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ తప్పనిసరిగా చేస్తున్నారు. కానీ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో వీరు పోటీ పడలేకపోతున్నారు. దీంతో ఈ విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. చైనా లాంటి దేశాల్లో ఆంగ్ల నాలెడ్జ్ ను అందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో వీరు కయ్యూనికేట్ రంగంలో పైచేయి సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనా కంటే భారత్ ఐటీ నిపుణులను విదేశాలకు ఎక్కువగా పంపుతుంది. ఒకవేళ చైనా ఇంగ్లీస్ నేర్పించడంలో సక్సస్ అయితే ఈ విషయంలో భారత్ వెనుకబడే అవకాశం ఉంది.
అందువల్ల ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ పరిజ్ఓానం తప్పనిసరి చేయాలి. ఇందులో నిష్ణాతులు చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. ఇంగ్లీష్ అంటే భారం కాదు.. బాధ్యత అని విద్యార్థులకు తెలియజేయాలి. అప్పడు భారత్ లో ఆంగ్లపై పట్టు పెరుగుతుంది. దీంతో యువకులు ఏ రంగంలోనైనా రాణించగలుగుతారు. ఇప్పటికే చాలా మంది కమ్యూనికేషన్ రంగంలో ప్రావీణ్యం పొంది విదేశాల్లో , ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు కూడా ఈ రంగాల్లో రాణించినప్పుడే విజయం సాధించినట్లు అనుకోవాలి. అయితే కేవలం ప్రభుత్వం మాత్రమే ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం కాకుండా తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు ఇంగ్లీష్ పై నాలెడ్జ్ పెంచుకునే విధంగా ప్రోత్సహించాలి. వీలైతే ఇంట్లోనూ ఇంగ్లీష్ మాట్లాడేందుకు ప్రయత్నించాలి.