Scam Massages: నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటోంది. వివిధ అవసరాల నేపథ్యంలో విద్యార్థుల నుంచి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ వాడుతున్నారు. ఈ తరుణంలో మొబైల్ కు రకరకాల మెసేజ్ లు వస్తుంటాయి. ఇందులో రియల్ ఏదో, ఫేక్ ఏదో తెలియని పరిస్థితి ఉంది. అంతేకాకుండా కొన్ని మెసేజ్ లు బ్యాంకు పేరిట వచ్చి ఆకర్షిస్తుంటాయి. దీంతో వెంటనే క్లిక్ చేయడం వల్ల ఈజీగా ఉంటుందని చెబుతారు. దీంతో కొంత మంది అవగాహన లేక వాటిపై క్లిక్ చేసి మోసపోతుంటారు. అయితే ఇలాంటి మెసేజ్ బారి నుంచి తప్పించుకోవాలంటే ఇలా చేయాలి.
ప్రతీ మొబైల్ కు ప్రతిరోజూ వందల మెసేజ్ లు వస్తుంటాయి. ప్రస్తుతం కాలంలో చాలా వరకు ఫేక్ వే ఉంటున్నాయి. కొన్ని బ్యాంకు పేరు చెప్పి మెసేజ్ లు వస్తుంటాయి. వీటిలో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవాలని, క్రెడిట్ కార్డు మీద రివార్డ్ పాయింట్స్ వచ్చాయని వస్తుంటాయి. మరికొన్ని మెసేసుల్లో మీరు అదనంగా డబ్బు పొందాలంటే లింక్ పై క్లిక్ చేయాలని చెబుతూ ఉంటారు. వీటికి చాలా మంది ఆకర్షితులవుతుంటారు.
Also Read: Money Investment Plans: మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియడం లేదా? 10 రెట్లు రిటర్న్ వచ్చే సలహా
కొందు వీటిపై అవగాహన లేకపోవడం వల్ల క్లిక్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో హ్యాకర్స్ మొబైల్ డేటా చోరీ చేసి బ్యాంకు అకౌంట్ వివరాలు తెలుసుకుంటారు. మనీ యాప్ పాస్ వర్డ్ తెలుసుకొని డబ్బులు కొల్లగొడుతారు. ఇలా క్లిక్ చేసి డబ్బులు పొగొట్టుకున్న కేసులు ఇప్పటికే చాలా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మెసెజ్ లు మీకు మాత్రమే కాకుండా ఇంకెవరికీ రాకుండా చేయాలంటే ఆన్ లైన్ లో ఇలా చేయాలి.
Also Read: India Post Courier: ఇండియా పోస్ట్ కొరియర్ ను వినియోగిస్తున్నారా? జాగ్రత్త
ముందుగా మొబైల్ లో గూగుల్ ఓపెన్ చేయాలి. ఆ తరువాత chakshusancharsaathi.gov.inఅని టైప్ చేయాలి. ఇప్పుడు వచ్చిన వాటిల్లో మొదటి వెబ్ సైట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది.ఆ తరువాత కంటిన్యూ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొంత సమాచారం ఇవ్వాలి. మీరు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? స్కామర్ కాల్స్ వస్తున్నాయా? లేదా మెసేజ్ లు వస్తున్నాయా? అనేది తెలియజేయాలి. ఆ తరువాత దేని గురించి మెసెజ్ వచ్చింది? ఉదాహరణకు బ్యాంకు పేరిట వచ్చిందా? లేక జాబ్స్ పేరిట వచ్చిందా? అనేది తెలియజేయాలి. ఆ తరువా మెసేజ్ ను స్కాన్ చేసి అప్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తరువాత సబ్మిట్ కొట్టాలి. దీంతో స్కామ్ మెసేజ్ ల గురించి ప్రభుత్వానికి కంప్లయింట్ చేయడం వల్ల వీటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.