Tollywood hero : ఈ ఫొటోలోని కుర్రాడు ఎవరో తెలుసా? ఓ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది..

Tollywood hero అయితే హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా సుహాన్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం సుహాన్ చేతిలో ‘ఆనంద్ రావ్ అడ్వెంచర్స్’, కేబుల్ రెడ్డి వంటి సినిమాలు ఉన్నాయి.

Written By: NARESH, Updated On : June 20, 2024 10:36 am

Tollywood Hero

Follow us on

Tollywood hero : టాలెంట్ ఉంటే సినీ ఇండస్ట్రీలో కచ్చితంగా రాణిస్తారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది హీరోలు ప్రూఫ్ చేసి చూపించారు. అయితే ఇటీవల సినిమా పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అనేక కారణాల వల్ల సినిమాలు రావడం తక్కువవుతున్నాయి. అయినా ఇలాంటి పరిస్థితుల్లో కొందరు యువకులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ ప్రతిభను కనబరుస్తున్నారు. తమ టాలెంట్ తో ప్రేక్షకుల మనసును దోచుకుంటారు. ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఓ కుర్రాడు.. ఆ తరువాత వెండితెరపై కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఈయనకు సంబంధించిన ఓ చిన్ననాటి పిక్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కుర్రాడు ఏ హీరోనో తెలుసా?

సోషల్ మీడియా పుణ్యామాని చాలా మంది నైపుణ్యం బయటపడుతోంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ విభాగంలో రాణించాలనుకునేవారు సోషల్ మీడియా మంచి వేదికగా మారింది. వీటిలో యూట్యూబ్ ద్వారా షార్ట్స్ చేస్తూ ఓ కుర్రాడు ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ఆయన టాలెంట్ ను గమనించిన కొందరు సినిమాల్లోకి హీరోగా ప్రెండ్ గా నటించేందుకు తీసుకున్నారు. ఈయన చూడ్డానికి అందంగా లేకపోయినా అమాయకంగా నటించి ఆకట్టుకున్నాడు. ఆ తరువాత హీరోగా రాణిస్తున్నారు.

ఆయన ఎవరో కాదు సుహాన్. విజయవాడలో పుట్టిన సుహాన్ కు స్టార్ హీరో కాకపోయినా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదట్లో యూ ట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో ఎక్కువగా నటించేవారు. ఆ తరువాత 2018లో ‘పడి పడి లేచే మనసు’ సినిమా ద్వారా వెండి తెరపై మొదటిసారిగా కనిపించారు. ఆ తరువాత మజిలీ, ప్రతిరోజూ పండుగే, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, వంటి సినిమాల్లో సైడ్ పాత్రలోల నటించారు.

ఆ తరువాత ‘కలర్ ఫొటో’ అనే సినిమా ద్వారా హీరో అయ్యాడు. ఈ సినిమా సక్సెక్ కావడంతో పాటు జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీంతో సుహాన్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తరువాత రైటర్ పద్మ భూషణ్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, శ్రీరంగ నీతులు, వంటి సినిమాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా సుహాన్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం సుహాన్ చేతిలో ‘ఆనంద్ రావ్ అడ్వెంచర్స్’, కేబుల్ రెడ్డి వంటి సినిమాలు ఉన్నాయి.