Site icon OkTelugu

Allu Arjun Vs Chiranjeevi: అల్లు అర్జున్ ను చిరంజీవి తో పోల్చడం కరెక్టేనా..?దీని వెనకాల ఎవరున్నారంటే..?

Allu Arjun Vs Chiranjeevi

Allu Arjun Vs Chiranjeevi

Allu Arjun Vs Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇండస్ట్రీ పెట్టిన పరీక్షలను తట్టుకొని ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి తన డాన్సులతో ప్రేక్షకులు మైమరిపించాడు. తన ఫైట్లతో మాస్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేశాడు… మొత్తంగా సినిమా ఇండస్ట్రీలో రారాజుల వెలుగొందుతున్నాడు. మెగాస్టార్ అనే ట్యాగ్ కి న్యాయం చేసిన వ్యక్తి కూడా తనే కావడం విశేషం…అలాంటి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి రాజకీయాల వైపు వెళ్ళాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

Also Read: విజయ్- రష్మిక పెళ్లి లో సందీప్ రెడ్డి వంగ కి అవమానం జరిగిందా..? అలా ఎలా చేశారు…

ఇక చిరంజీవి ఇప్పటివరకు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్ లాంటి నటుడు సైతం రోజురోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. పుష్ప ది రూల్ లో నటించినందుకు గాను రీసెంట్ గా అతనికి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఇక ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డునైతే అందుకున్నాడు.

పరుగు, వేదం, రేసుగుర్రం, రుద్రమదేవి, సరైనోడు, పుష్ప ది రైస్, పుష్ప ది రూల్ సినిమాలో నటించినందుకు గాను అతనికి ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డులైతే వచ్చాయి. చిరంజీవికి సైతం శుభలేఖ, విజేత, ఆపద్బాంధవుడు, ముఠామేస్త్రి, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాల్లో నటించిన అతనికి ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డులైతే వచ్చాయి…

ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ ను చిరంజీవితో పోల్చుతున్నారు. నిజానికి చిరంజీవి ఎన్నో గొప్ప విజయాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. మెగాస్టార్ అనే పదానికి అతను తప్ప మరొకరు న్యాయం చేయలేరు అలాంటి హీరోతో అల్లు అర్జున్ ని పోల్చడం ఏంటి అంటే మరి కొంతమంది కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక కావాలనే కొంతమంది ఇలా చేస్తున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నాడు…

Exit mobile version