India Post Courier: ఇండియా పోస్ట్ కొరియర్ ను వినియోగిస్తున్నారా? జాగ్రత్త

ప్రస్తుతం కొత్తగా ఇండియా పోస్ట్ అంటూ తమ దారి మార్చారు సైబర్ నేరగాళ్లు. మీకు డెలివరీ వచ్చింది. మీకు వెళ్లాల్సిన కొరియర్ ఇతరులకు వెళ్లింది. ఇప్పటికే రెండు సార్లు వచ్చాము. కానీ మీ అడ్రస్ మాకు దొరకలేదు అంటూ నమ్మిస్తుంటారు నేరగాళ్లు.

Written By: Swathi Chilukuri, Updated On : June 20, 2024 8:45 am

India Post Courier

Follow us on

India Post Courier: సైబర్ క్రైమ్స్ చాలా పెరుగుతున్నాయి. ఇక హ్యాకర్స్ తమ రూట్ మార్చి బ్యాంకులకు చొరబడి మొత్తం డబ్బులు లూటీ చేస్తున్నారు. ఘర్ బైటే బైటే అన్నట్టు.. జస్ట్ మనం ఇంట్లో కూర్చొని ఒక లింక్ నొక్కడం వల్ల ఎక్కడో ఉన్న స్కామర్స్ అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం దొంగిలిస్తున్నారు. కళ్ల ముందు కనిపించరు. బీర్వ పగలదు. తాళం విరగదు. కానీ దొంగలు పడతారు. ఇదంతా కేవలం ఒక లింక్ వల్ల. కేవలం ఒకే ఒక లింక్ వల్ల మీ అకౌంట్ లో డబ్బులు మొత్తం స్వాహా అంటాయి. అందుకే జాగ్రత్త.

ప్రస్తుతం కొత్తగా ఇండియా పోస్ట్ అంటూ తమ దారి మార్చారు సైబర్ నేరగాళ్లు. మీకు డెలివరీ వచ్చింది. మీకు వెళ్లాల్సిన కొరియర్ ఇతరులకు వెళ్లింది. ఇప్పటికే రెండు సార్లు వచ్చాము. కానీ మీ అడ్రస్ మాకు దొరకలేదు అంటూ నమ్మిస్తుంటారు నేరగాళ్లు. దాంట్లో అడ్రస్ అప్డేట్ చేయండని ఓ లింక్ ను పంపిస్తారు. అది చూసి నిజమే కదా అకౌంట్ డిటైల్స్ అడగడం లేదు. కేవలం అడ్రస్ కదా అంటూ మీరు లింక్ ను క్లిక్ చేస్తే వెంటనే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది.

ఒక్కసారిగా ఫోన్ స్ట్రక్ అయిన తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ లు వస్తుంటాయి. ఇది చూస్తూ తల పట్టుకోవడం తప్ప మీరు చేయాల్సింది ఏం ఉండదు. అందుకే ఇలాంటి లింక్ లు ఏది వచ్చినా సరే క్లిక్ చేయకుండా ఉండటమే బెటర్. లేదంటే మీరే స్వయంగా వారికి సహకారం చేసిన వారు అవుతారు. రీసెంట్ గా కలకత్తాలో కూడా ఒక మహిళకు ఇదే విధంగా జరిగింది. ఏకంగా ఆమె అకౌంట్ లో ఉన్న లక్ష యాభైవేలు కట్ అయ్యాయట. ఇలాంటి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి కూడా.

మరి ఇలాంటి లింక్స్ వస్తే ఏం చేయాలి?
కొంత సమాచారం వాస్తవంగా కూడా వస్తుంది. అలాంటప్పుడు లింక్స్ క్లిక్ చేయాలా వద్దా అనే అనుమానం కూడా మీలో కలగవచ్చు. అయితే ఇలాంటి లింక్స్ వచ్చినప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఆఫీస్ కు వెళ్లాలి. పోస్టాఫీస్ లు చాలా అందుబాటులోనే ఉంటాయి. కాస్త సమయం కేటాయిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో జాగ్రత్త ఫ్రెండ్స్.