Government Investments : ఈ యాప్ ద్వారా ప్రభుత్వ పెట్టుబడులు పెడితే డబ్బు సేఫ్.. మంచి రిటర్న్స్..

Government Investments నేటి కాలంలో సైబర్ నేరగాళ్లు ఎక్కువవుతున్నారు. ఈ తరుణంలో ఏదీ రియలో, ఏదీ ఫేకో తెలుసుకోవడం కష్టంగా ఉంది. అందువల్ల ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు పూర్తిగా అవగాహన లేకుంటే బ్యాంకును సంప్రదించాలి.

Written By: Srinivas, Updated On : June 20, 2024 10:28 am

RBI Retail Direct App

Follow us on

Government Investments : డబ్బు పొదుపు చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ చాలా మంది ఈ విషయంలో పొరపాట్లు చేస్తుంటారు. కొందరు సాధారణ ఇన్వెస్ట్ మెంటు చేసి సమయం వృథా చేసుకుంటారు. మరికొందరు అధిక వడ్డీకి ఆశపడి కొన్ని ప్రైవేట్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసి మోసపోతారు. అయితే ప్రభుత్వపరంగా డబ్బును ఇన్వెస్ట్ మెంట్ చేసి డబ్బును సేఫ్ గా ఉంచుకోవడంతో పాటు ఎక్కువ రిటర్న్స్ పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్స్ చేసేటప్పుడు ఫేక్ సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే చాలా నష్టపోతారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయనే ఆర్బీఐ కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

డబ్బు సేఫ్ గా ఉండాలని చాలా మంది అనుకుంటారు. దీంతో ప్రభుత్వానికి సంబంధించిన పెట్టుబడుల్లో ఇన్వెస్ట్ మెంట్ చేయడం వల్ల భద్రంగా ఉంటుంది. అయితే బ్రోకరేజీ ద్వారా కాకుండా నేరుగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అదనపు ఫీజు నుంచి తప్పించుకోవచ్చు. ఈ క్రమంలో ఆన్ లైన్ లో వెబ్ సైట్ ద్వారా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే ఇదే సమయంలో కొందరు సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ వెబ్ సైట్ మాదిరిగానే ఫేక్ వెబ్ సైట్లను తయారు చేస్తున్నారు. ఇవి ప్రభుత్వానికి సంబంధించినవనే చాలా మంది ఇందులో పెట్టుబడులు పెడుతూ మోసపోతున్నారు.

ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే RBI Retail Direct. ఈ యాప్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ బాండ్స్, ట్రెజరీ బిల్స్, గోల్డ్ బాండ్స్ లో నేరుగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఎలాంటి బ్రోకరేజ్ అవసరం లేదు. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా ఇన్వెస్ట్ మెంట్ చేయడం వల్ల ఎలాంటి ఫీజులు కూడా ఉండవు. అంతేకాకుండా మొబైల్ ఉన్న మనీ యాప్స్ యూపీఐ ద్వారా కూడా నేరుగా ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు.

నేటి కాలంలో సైబర్ నేరగాళ్లు ఎక్కువవుతున్నారు. ఈ తరుణంలో ఏదీ రియలో, ఏదీ ఫేకో తెలుసుకోవడం కష్టంగా ఉంది. అందువల్ల ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు పూర్తిగా అవగాహన లేకుంటే బ్యాంకును సంప్రదించాలి. లేదా నిపుణుల సాయం తీసుకొని పెట్టుబడులు పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ యాప్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలి.