Money Investment Plans: మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియడం లేదా? 10 రెట్లు రిటర్న్ వచ్చే సలహా

సేవింగ్స్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అందులో ఏది ఎంచుకోవాలని క్లారిటీ లేకుండా సతమతం అవుతుంటారు. పోస్టాఫీస్, స్టాక్ మార్కెట్స్, ఎల్ఐసీ, బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ వంటివి చేయాలి అనుకుంటారు.

Written By: Swathi Chilukuri, Updated On : June 20, 2024 8:48 am

Money Investment Plans

Follow us on

Money Investment Plans: ప్రస్తుతం చాలా మంది సేవింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు. జీతం వచ్చిన వెంటనే ఖర్చు అవుతుంటుంది. నెల జీతం రాగానే నాలుగు రోజులు కూడా అకౌంట్ లో డబ్బులు ఉండటం లేదు. ఇలాంటి సందర్బాల్లో టెన్షన్ ఎక్కువ అవుతుంది అనడంలో సందేహం లేదు. పిల్లలు పెరుగుతుంటారు. ఖర్చు పెరుగుతుంది. సేవింగ్స్ చూస్తే జీరో. అందుకే ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉన్నారా? ఎందులో కూడా ఇన్వెస్ట్ చేయలేదా? మరి ఓ సారి ఇది చదవండి.

సేవింగ్స్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అందులో ఏది ఎంచుకోవాలని క్లారిటీ లేకుండా సతమతం అవుతుంటారు. పోస్టాఫీస్, స్టాక్ మార్కెట్స్, ఎల్ఐసీ, బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ వంటివి చేయాలి అనుకుంటారు. కానీ అందులో రిటన్స్ ఎక్కువ రావడం లేదని ఆందోళన కూడా చెందుతున్నారు. అయితే మీరు నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. దీని వల్ల మీకు మంచి రిటర్న్ వస్తుంటాయి.

గత పది సంవత్సరాలలో 26.8 శాతం, గత ఐదు సంవత్సరాలలో 30. 4 శాతం రిటర్న్ ను ఇచ్చిందట. మీరు గనక 2014లో పెట్టుబడి పెట్టి ఉంటే అంటే ఈ పది సంవత్సరాల కాలంలో పది రెట్లు రిటర్న్ వచ్చేది. దీన్ని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గ్రూప్స్ వారు అందుబాటులోకి తీసుకొని వచ్చారు.

అయితే ఇది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని అందుబాటులో ఉన్న కంపెనీల్లో అందుబాటులో ఉంటుంది ఈ నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్సె ఫండ్. మీ ఫండ్ ను ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంతేకాదు దీనికి మీరు టాక్స్ బెనిఫిట్ ను కూడా పొందవచ్చు. రూ. 10 నుంచి రూ. 2000 వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి వారి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి.