Software Employee : వాస్తవానికి 10 నుంచి పాతికవేలు లభించే ఉద్యోగాలు పోతేనే ప్రపంచం మొత్తం మునిగిపోయిందని భావించే రోజులివి. అలాంటి ప్రస్తుత కాలంలో ఏడాదికి 76 లక్షల వేతనం వచ్చే ఉద్యోగాన్ని ఓ మహిళ కోల్పోయింది. ఆమె ఐటీ సెక్టార్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. అంతటి ఉద్యోగం పోతే ఎవరైనా సరే గుండెలు బాదుకుంటారు. రేపటి నుంచి ఎలా బతకాలని భయపడుతుంటారు. మరో ఉద్యోగం వచ్చినా.. ఆ స్థాయిలో వేతనం దొరుకుతుందో?, దొరకదో తెలియక సతమతమవుతూ ఉంటారు. కానీ 76 లక్షల వేతనం వచ్చే ఉద్యోగం పోయినందుకు ఆ మహిళ సంబరపడుతోంది. ఎగిరి గంతులు వేస్తోంది. అమెరికాలోని చికాగోలో డెలాయిట్ కంపెనీలో 24 సంవత్సరాల సియోర్రా డెస్మరాట్టి పనిచేస్తోంది.. 2022లో అనలిస్టుగా ఆమె ఉద్యోగంలో చేరింది. అప్పట్లో ఆమె వార్షిక వేతనం 76 లక్షలు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, ఖర్చులు తగ్గింపు.. వంటి చర్యల నేపథ్యంలో కంపెనీ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది..” మీరు రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదు. మీకు ఇక ఇక్కడ ఉద్యోగం లేదని” సియోర్రా డెస్మరాట్టి కి మెయిల్ ద్వారా డెలాయిట్ కంపెనీ ఆమెకు సమాచారం అందించింది. వాస్తవానికి ఆ మెయిల్ చూడగానే ఆమె ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఈ విషయాన్ని ఆమె ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత సంవత్సరం బయటి ప్రపంచానికి తెలియజేసింది.
ఉద్యోగం పోవడం మంచి విషయం
ఆ ఉద్యోగం పోవడం తన జీవితంలో మంచి విషయమని సియోర్రా డెస్మరాట్టి చెబుతోంది. ఐటీ ఉద్యోగం చేయడం వల్ల రోజు మొత్తం కూర్చోవడం తన వల్ల కాలేదని చెబుతోంది. పొట్టి దుస్తులు వేసుకొని… ఆచర ఉద్యోగుల ముందు నడవాలంటే ఇబ్బందిగా ఉండేదని తన ఆవేదనలో వ్యక్తం చేసింది..” నా కుటుంబానికి పెద్దగా ఆదాయం లేదు. ఒక రకంగా చెప్పాలంటే పేద కుటుంబం. అయినప్పటికీ నా ఉద్యోగం పోయినందుకు నేను ఇబ్బంది పడలేదు. 2022లో నేను ఉద్యోగంలో చేరిన సమయంలో కంపెనీ బిల్డింగ్ లో 90 మంది పనిచేసే వారు. వారిని చూసిన తర్వాత అలాంటి దుస్తులు ధరించాల్సి వచ్చింది. నాకు అవి ఏమాత్రం నచ్చలేదు. రోజు మొత్తం కుర్చీలో కూర్చోడం వల్ల నాకు వెన్ను నొప్పి వచ్చేది. నచ్చిన ఆహారాన్ని తినలేక పోయేదాన్ని. కేవలం చిరుతిళ్ళ మీద ఆధారపడటం వల్ల ఏకంగా 9 కిలోలు బరువు పెరిగాను. ఇన్నాళ్లకు ఉద్యోగం పోయిన తర్వాత సంతోషపడుతున్నారని” సియోర్రా డెస్మరాట్టి వ్యాఖ్యానించింది. ” 76 లక్షల సాలరీ వచ్చే జాబ్ పోయిందని నాకు పెద్దగా టెన్షన్ లేదు. అంత వేతనం వచ్చే ఉద్యోగం పోయినంతమాత్రాన నా జీవితం ముగిసినట్టు కాదు కదా. ప్రస్తుతం నేను ట్రాన్స్ అమెరికా కు చెందిన కంపెనీలో యాక్చురియల్ అనలిస్ట్ గా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానని” సియోర్రా డెస్మరాట్టి వ్యాఖ్యానిస్తోంది. అమెరికా వ్యాప్తంగా ఖర్చు తగ్గింపులో భాగంగా చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే వారంతా ఉద్యోగం పోయిందని బాధపడకుండా.. ఇంకో ఉద్యోగాన్ని చూసుకోవాలనే ధైర్యాన్ని ఇచ్చేందుకు సియోర్రా డెస్మరాట్టి ఇలాంటి హిత బోధ చేసిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు