https://oktelugu.com/

Trisha : స్టార్ హీరోకి తన ఇంటిని రాసి ఇచ్చేసిన త్రిష..ఆ ఇంటి విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

త్రిష స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్స్ ని దక్కించుకుంటూ కుర్ర హీరోయిన్స్ కి కూడా దక్కని అవకాశాలను సంపాదించుకుంటూ కెరీర్ లో పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 12, 2024 / 09:45 PM IST

    Thrisha

    Follow us on

    Trisha : సౌత్ ఇండియాలో స్టార్ హీరోలతో సమానమైన ఇమేజి ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే, అందులో త్రిష పేరు కచ్చితంగా ఉంటుంది. క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత హీరోయిన్ గా అందుకున్న విజయాలు సాధారణమైనవి కావు. తెలుగు లో ఈమెకి ఎలాంటి క్రేజ్ ఉందో, తమిళం లో కూడా ఆమెకి అదే స్థాయి క్రేజ్ ఉంది. ఇండస్ట్రీ కి వచ్చి రెండు దశాబ్దాలకు పైగా అయినప్పట్టికీ, ఈ గ్యాప్ లో ఎంతోమంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ, త్రిష స్థానాన్ని ఎవ్వరు రీ ప్లేస్ చేయలేకపోయారు. ఇప్పటికీ కూడా ఈమె స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్స్ ని దక్కించుకుంటూ కుర్ర హీరోయిన్స్ కి కూడా దక్కని అవకాశాలను సంపాదించుకుంటూ కెరీర్ లో పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

    ఈమె ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న చెన్నై లోని ఒక ఇంటిని ప్రముఖ సీనియర్ హీరో , ప్రస్తుత క్యారక్టర్ ఆర్టిస్టు భాను చందర్ కి అమ్మేసిందట. ఈ ఇంటి విలువ దాదాపుగా 8 కోట్ల రూపాయిలు ఉంటుందని సమాచారం. కోట్ల రూపాయిలు సంపాదించే త్రిష కి ఇంటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, ఈ ఇంటిని మాత్రం భాను చందర్ ఎంతో అందంగా తయారు చేసుకున్నాడు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ ఇంటి గురించి పలు విషయాలు చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ ఇల్లు హీరోయిన్ త్రిష ది. చాలా ఏళ్ళ క్రితం ఆమె నాకు ఈ ఇంటిని అమ్మేసింది. మేము కొన్న తర్వాత ఇంటి చుట్టూ నా భార్య మొక్కల్ని పెంచేసింది. చూసేందుకు ఎంతో ఆహ్లాదంగా ఉంది కదూ. మా ఇంటి ప్రారంభం లో ఉన్న మినీ బార్ ని చూసి నేను తాగుబోతుని అనుకోకండి. నాకు అసలు తాగే అలవాటు లేదు. అక్కడ ఉన్నవి మొత్తం ఖాళీ బాటిల్స్. కేవలం స్టైలిష్ లుక్ కోసం అలాంటి మినీ బార్ సెటప్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు భానుచందర్.

    ఇక త్రిష ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీ గా ఉందో మన అందరికీ తెలిసిందే. ఈమె ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ లో హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గానే ఈమె తలపతి విజయ్ హీరో గా నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ముందు ఆమె విజయ్ ‘లియో’ చిత్రంలో కూడా నటించింది. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో కుర్ర హీరోయిన్స్ కి పోటీ ని ఇస్తుంది త్రిష.