https://oktelugu.com/

Koratala Shiva : సంగీత దర్శకుడు అనిరుద్ పై కొరటాల శివ అసంతృప్తి..’దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గైర్హాజరు?

దేవర' కు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. హీరో క్యారక్టర్ మీద వచ్చే మొదటి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఆ తర్వాత విడుదలైన డ్యూయెట్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు పాటల తర్వాత విడుదలైన మూడవ పాట 'దావుడి' పాటకు మాత్రం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 12, 2024 / 09:23 PM IST

    Koratala Shiva

    Follow us on

    Koratala Shiva :  సౌత్ ఇండియా లో ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో నెంబర్ 1 ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అనిరుద్ రవించంద్రన్. ఇతను అందించే పాటలు ఆడియన్స్ ని భాషతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసేలా చేస్తుంది. ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ని అందించాడు. రీసెంట్ గా రజినీకాంత్ కొత్త సినిమా ‘వెట్టియాన్’ కి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఏ రేంజ్ మ్యూజిక్ కొట్టాడో మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ని ఈ పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపేస్తోంది. అయితే కొరటాల శివ మాత్రం ‘దేవర’ చిత్రం విషయం లో అనిరుద్ పై కాస్త అసంతృప్తి తో ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే రీసెంట్ గా వచ్చిన ఆల్బమ్స్ లో ది బెస్ట్ అనే విధంగా ఈ సినిమాకి అందించాడు కదా, ఇంకేంటి సమస్య అని మీరు అనుకోవచ్చు. నిజానికి ‘దేవర’ కు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. హీరో క్యారక్టర్ మీద వచ్చే మొదటి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఆ తర్వాత విడుదలైన డ్యూయెట్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు పాటల తర్వాత విడుదలైన మూడవ పాట ‘దావుడి’ పాటకు మాత్రం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది.

    ఇంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఆడియన్స్ నుండి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కేవలం ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మాత్రమే కాదు, మూవీ టీం కూడా ఈ పాట పట్ల సంతృప్తి గా లేదు. కొరటాల శివ రీసెంట్ గా సినిమాని ఎడిటింగ్ చేస్తున్న సమయంలో ఈ పాటని రోలింగ్ టైటిల్స్ అప్పుడు వచ్చేలా ప్లేస్ చేసాడట. అదేంటి సార్, మంచి డ్యాన్స్ నెంబర్ ని చివర్లో పెట్టించారు అని టీం అడగగా, ఏమి చేస్తాం, అలాంటి పాట అందించాడు అని అనిరుద్ పై తన అసహనం ని వ్యక్తం చేసాడట కొరటాల శివ. ఇలా డైరెక్టర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ మధ్య గ్యాప్ ఏర్పడింది అని, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనిరుద్ వచ్చే అవకాశాలు కూడా తక్కువే అని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన మరో పాట బ్యాలన్స్ ఉంది.

    ఆయుధ పూజ సాంగ్ గా పిలవబడుతున్న ఈ పాట సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలవబోతుందట. ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలకంటే ఈ పాట ఎక్కువగా హైలైట్ అవుతుందట. ఆ స్థాయిలో అనిరుద్ కొట్టాడని టాక్. సినిమాలోని ఒక పోరాట సన్నివేశం సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట అట ఇది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ కి ప్రారంభం లో డివైడ్ టాక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ గ్లోబల్ వైడ్ గా 13 స్థానం లో ట్రెండ్ అవుతుంది. అంతే కాకుండా మొదటి రోజు 10 మిలియన్ వ్యూస్ రాగా, ఇప్పుడు ఏకంగా 31 మిలియన్ వ్యూస్ వచ్చినట్టుగా చెప్తున్నారు.