Apache RTR 200 4V: మనదేశంలో మోటార్‌సైకిళ్లు తయారుచేసే టీవీఎస్ సంస్థ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ మోటార్‌సైకిల్ కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. 2025లో వస్తున్న ఈ మోడల్ ధర షోరూమ్ వద్ద 1,53,990 రూపాయలు. కొత్త బైక్‌లో అనేక కాస్మెటిక్ అప్‌డేట్లు, హార్డ్‌వేర్ అప్‌డేట్లు, ఇంజిన్ కూడా అప్‌డేట్ చేయబడింది. బైక్ ఇంజిన్ ఇప్పుడు ఓబీడీ2బీ (OBD2B) ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేయబడింది.
2025 టీవీఎస్ అపాచే ఆర్‌టీఆర్ 200 4వీ ఇప్పుడు 37 మిల్లీమీటర్ల ‘అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్’తో వస్తుంది. ఇది మోటార్‌సైకిల్‌ను మరింత స్థిరంగా ఉంచుతుంది, నడిపేటప్పుడు సులువుగా కంట్రోల్ చేసే విధంగా చేస్తుంది, ప్రయాణాన్ని మరింత సుఖవంతంగా మారుస్తుంది. హ్యాండిల్‌బార్ ఇప్పుడు ప్రత్యేక పద్ధతిలో తయారుచేశారు. దీనివల్ల మోటార్‌సైకిల్‌ను సులువుగా నడపవచ్చని టీవీఎస్ చెబుతోంది. చివరిగా, అల్లాయ్ వీల్స్‌తో కొత్త డిజైన్లు కూడా అందించారు. టీవీఎస్ సంస్థ 2025 అపాచే ఆర్‌టీఆర్ 200 4వీని మూడు రంగుల్లో (గ్రోస్సీ బ్లాక్, మ్యాట్ బ్లాక్, గ్రానైట్ గ్రే) అమ్ముతోంది.
Also Read: TVS Sport : హీరో స్ప్లెండర్‌కు ఇక కష్టకాలమే.. కేవలం రూ.60వేలకే అదిరిపోయే మైలేజ్ బైక్!
ఇంజిన్, పర్ఫామెన్స్
టీవీఎస్ తయారుచేసిన ఈ మోటార్‌సైకిల్‌లో గతంలో ఉన్న ఇంజిన్‌నే వాడారు. ఇది గంటకు 9,000ఆర్పీఎం వేగంతో తిరుగుతూ 20.51 బీహెచ్‌పీ పవర్, 7,250 ఆర్‌పిఎమ్ వేగంతో తిరుగుతూ 17.25 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. నగరంలో నడపడానికి (అర్బన్), వేగంగా నడపడానికి (స్పోర్ట్), వర్షంలో నడపడానికి (రెయిన్). గేర్‌బాక్స్ స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో కూడిన 5-స్పీడ్ సిస్టమ్ ఉంది. ఈ మోటార్‌సైకిల్ గంటకు గరిష్టంగా 127 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇది ఒక లీటరు పెట్రోల్‌కు దాదాపు 39 కిలోమీటర్ల దూరం వెళ్తుందని చెబుతున్నారు.
Also Read: Norton: రాయల్ ఎన్ ఫీల్డ్ చెక్ పెట్టేలా టీవీఎస్ ప్లాన్.. రంగంలోకి నార్టన్ బైక్
అపాచీలో ఉన్న స్పెషాలిటీ
టీవీఎస్ సంస్థ తమ ప్రొడక్టులతో మంచి స్పెషాలిటీలను అందించడంలో పేరు పొందింది. అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీలో కూడా కొన్ని స్పెషాలిటీలు అందించారు. ఇందులో అడ్జస్టబుల్ లీవర్లు, టీవీఎస్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ , వాయిస్ కమాండ్ ఇచ్చే సదుపాయం ఉన్న డిజిటల్ మీటర్స్, పగటిపూట వెలిగే లైట్లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, బ్యాక్ లైట్ ఉన్నాయి. ఇందులో వెనుక చక్రం పైకి లేవకుండా ఆపే వ్యవస్థతో కూడిన డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంది. మనదేశంలో ఈ మోటార్‌సైకిల్‌కు బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మోటార్‌సైకిల్‌తో పోటీ ఉంటుంది. ఈ కొత్త మార్పులు అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీకి మరింత ఆకర్షణను తెచ్చాయి.