Mega 157 Update: ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న హీరోలు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తూ ముందుకు దూసుకెళ్లిన ఏకైక హీరో మాత్రం చిరంజీవి గారే కావడం విశేషం… జీరో గా కెరియర్ ను స్టార్ట్ చేసి హీరోగా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ మెగాస్టార్ అనే ఒక హోదాని సంపాదించుకున్న వ్యక్తి కూడా తనే కావడం విశేషం…
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. కానీ గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)…ఈయన చేసిన సినిమాలు ఆయనకి గొప్ప గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ఆయన వశిష్ట (Vashishta) డైరెక్షన్లో చేస్తున్న విశ్వంభర (Vishwambhara) సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న చిరంజీవి ఇప్పటివరకు ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక రెండో షెడ్యూల్లో ఆయనతో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 200 మందితో చిరంజీవి ఒక భారీ ఫైట్ ను చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అనిల్ రావిపూడి యాక్షన్ డోస్ ను కూడా ఎక్కువగా పెంచినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా చిరంజీవిని అల్టిమేట్ గా చూపించి ఆయనకు ఒక భారీ సక్సెస్ ని సాధించి పెట్టడంలో అనిల్ సక్సెస్ అవుతాడా? లేదా అనే విషయంలోనే ఇప్పుడు చాలా వరకు కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. మరి చిరంజీవి తన రేంజ్ ని మరోసారి పిక్స్ లెవెల్లో చూపించి తనకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికే సీనియర్ హీరోలైన వెంకటేష్ బాలయ్యాలకు మంచి సక్సెస్ లను అందించిన అనిల్ రావిపూడి చిరంజీవి విషయానికి వచ్చేసరికి ఎలాంటి సక్సెస్ ని సాధించి పెడతాడు అనేదే తెలియాల్సి ఉంది…ఇక ఈ మూవీతో సక్సెస్ సాధిస్తే సీనియర్ హీరోల ముగ్గురికి మంచి విజయాలను అందించిన ఈతరం దర్శకుడిగా అనిల్ కి మంచి గుర్తింపైతే వస్తుంది…