Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీStarlink: శాటిలైట్ నుంచి నేరుగా సెల్ ఫోన్ కు.. మాస్క్ సంచలనం.. వినియోగదారులకు గుడ్ న్యూస్

Starlink: శాటిలైట్ నుంచి నేరుగా సెల్ ఫోన్ కు.. మాస్క్ సంచలనం.. వినియోగదారులకు గుడ్ న్యూస్

Starlink: టెక్నాలజీని ఉపయోగించి వ్యాపారం చేయడంలో.. కోట్లకు కోట్లు గడించడంలో మస్క్ ది అందె వేసిన చేయి. టెస్లా, ట్విట్టర్, ఇంకా రకరకాల వ్యాపారాలతో మస్క్ భారీగా సంపాదిస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కోటీశ్వరుడిగా అవతరించాడు. ఇప్పుడు స్టార్ లింక్ ద్వారా సరికొత్త వ్యాపారానికి మస్క్ తెర తీశాడు. మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ యాజమాన్యంలో గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ (సాట్ కామ్) స్టార్ లింక్ 2027 లో డైరెక్ట్ టు సెల్ ఉపగ్రహాలను ప్రయోగించబోతోంది. ఈ కంపెనీ […]

Starlink: టెక్నాలజీని ఉపయోగించి వ్యాపారం చేయడంలో.. కోట్లకు కోట్లు గడించడంలో మస్క్ ది అందె వేసిన చేయి. టెస్లా, ట్విట్టర్, ఇంకా రకరకాల వ్యాపారాలతో మస్క్ భారీగా సంపాదిస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కోటీశ్వరుడిగా అవతరించాడు. ఇప్పుడు స్టార్ లింక్ ద్వారా సరికొత్త వ్యాపారానికి మస్క్ తెర తీశాడు.

మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ యాజమాన్యంలో గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ (సాట్ కామ్) స్టార్ లింక్ 2027 లో డైరెక్ట్ టు సెల్ ఉపగ్రహాలను ప్రయోగించబోతోంది. ఈ కంపెనీ మొట్టమొదట 2024 లో డైరెక్ట్ టు సెల్ సేవలను ప్రకటించింది. బార్సిలోనా ప్రాంతంలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో 2027లో డైరెక్ట్ టు సెల్ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ చెప్పారు. ఇది స్టార్ షిప్ తో తక్కువ భూమి కక్ష్య లోకి వెళ్తుందని వెల్లడించారు. “మేము 2027 మధ్యలో స్టార్ షిప్ తో ప్రయోగాన్ని మొదలు పెడతాం. త్వరగానే నక్షత్ర సముదాయాన్ని చేరుకోగలుగుతాము. ప్రారంభంలో ఇది ఒక వెయ్యి రెండు వందల ఉపగ్రహాలను కలుపుతుంది. రెండవ తరం కాన్సల్టేషన్ కార్యక్రమం ద్వారా ఉపగ్రహ వ్యవస్థకు, భూ సంబంధమైన కనెక్టివిటీ అందిస్తాం. స్టార్ లింక్ కాన్సల్టేషన్లో 9,000 కంటే ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో డైరెక్ట్ టు సెల్ టెక్నాలజీలో దాదాపు 600 ఉపగ్రహాల వరకు ఉన్నాయని” స్టార్ లింక్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ నికోల్స్ పేర్కొన్నారు.

ఏం జరుగుతుంది
శాటిలైట్ టు సెల్ ద్వారా ఇంటర్నెట్ వేగంలో మార్పు వస్తుందని.. యూజర్లకు అద్భుతమైన సేవలు అందుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని దేశాలలో ఆరవతరం, ఇంకొన్ని దేశాలలో ఐదవ తరం ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రపంచం మొత్తం ఒకే తీరైన ఇంటర్నెట్ సేవలు ఉండాలని.. అత్యంత వేగవంతమైన సర్వీస్ లభించాలని మస్క్ మొదటి నుంచి కూడా భావిస్తున్నాడు. అందువల్లే శాటిలైట్ టు సెల్ అనే విధానాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఇప్పటికే స్టార్ లింక్ ద్వారా అంతరిక్ష కార్యాలపాలు సాగిస్తున్న మస్క్.. శాటిలైట్ టు సెల్ విధానంతో ఇంటర్నెట్ రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మస్క్ తో అనేక దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మనదేశంలో భారతీ ఎయిర్టెల్, జియో వంటి సంస్థలు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper