https://oktelugu.com/

ఎయిర్‌టెల్‌ యూజర్లకు అలర్ట్.. జాగ్రత్తగా ఉండమంటున్న పోలీసులు..?

దేశంలో కోట్ల సంఖ్యలో మొబైల్ ఫోన్ యూజర్లు ఎయిర్ టెల్ సిమ్ ను వినియోగిస్తున్నారు. అయితే ఎయిర్ టెల్ సిమ్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఎయిర్ టెల్ కస్టమర్లను టార్గెట్ చేసి కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేవైసీ అప్ డేట్ అంటూ లింక్ వస్తే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఈ విధంగా ఎయిర్ టెల్ యూజర్లకు సూచనలు చేయడానికి ముఖ్యమైన కారణమే ఉంది. పూర్తి వివరాల్లోకి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 31, 2021 12:32 pm
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో మొబైల్ ఫోన్ యూజర్లు ఎయిర్ టెల్ సిమ్ ను వినియోగిస్తున్నారు. అయితే ఎయిర్ టెల్ సిమ్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఎయిర్ టెల్ కస్టమర్లను టార్గెట్ చేసి కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేవైసీ అప్ డేట్ అంటూ లింక్ వస్తే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఈ విధంగా ఎయిర్ టెల్ యూజర్లకు సూచనలు చేయడానికి ముఖ్యమైన కారణమే ఉంది.

    పూర్తి వివరాల్లోకి వెళితే సైబర్ మోసగాళ్లు ఈ మధ్య కాలంలో ఎయిర్ టెమ్ సిమ్ ను వాడుతున్న యూజర్లు కేవైసీ చేయకపోతే సిమ్ కార్డ్ పని చేయదంటూ మొబైల్ ఫోన్ కు మెసేజ్ లను పంపుతున్నారు. కేవైసీ చేసుకోవాలంటే ఈ లింక్ లను క్లిక్ చేయాలంటూ యూజర్లకు మెసేజ్ లను పంపుతున్నారు. యూజర్లలో కొంతమంది ఆ ఫేక్ లింక్ లను క్లిక్ చేసి మోసపోతున్నారు. ఎయిర్ టెల్ సైతం యూజర్లు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తోంది.

    హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విట్టర్ ద్వారా పోలీసులు ఎయిర్ టెల్ యూజర్లలో కొంతమందికి కేవైసీ చేయించుకోవాలని కాల్స్, మెసేజెస్ వస్తున్నాయని.. సైబర్ మోసగాళ్లు లింక్ ను పంపి సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకోమని చెబుతున్నారని.. ఆ తరువాత 10 రూపాయలు చెల్లిస్తే మొబైల్ సర్వీసులు కొనసాగుతాయని వెల్లడిస్తున్నారని అలాంటి ఫేక్ లింక్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎవరైనా 10 రూపాయలు చెల్లిస్తే వారి బ్యాంకు ఖాతా ఖాళీ అవుతోంది.

    ఫేక్ లింక్ లను క్లిక్ చేయడం ద్వారా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఎయిర్‌టెల్‌ కేవైసీ పేరుతో ఎవరైనా కాల్స్, మెసేజెస్ చేస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించి ఫిర్యాదు చేస్తే మంచిది.