కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్‌..?

ఏ ఫ్యామిలీలో అయినా ఆస్తుల పంపకాలు జరుగుతుంటాయి. కానీ.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కుటుంబంలో మాత్రం పదవుల పంపకాలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో సీఎం సీటు మార్పు ఖాయంగా కనిపిస్తుండడంతో ఎవరెవరికి ఏ పదవి కేటాయిస్తారా అని ఆసక్తిగా మారింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌‌ కూడా ఎవరికి ఏ పదవి అప్పజెప్పాల్నో ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం మార్పులో భాగంగా కేటీఆర్‌‌కు సీఎం పదవి అని ఇప్పటికే ఖరారైంది. మరి కేసీఆర్‌‌ […]

Written By: Srinivas, Updated On : January 31, 2021 12:26 pm
Follow us on

ఏ ఫ్యామిలీలో అయినా ఆస్తుల పంపకాలు జరుగుతుంటాయి. కానీ.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కుటుంబంలో మాత్రం పదవుల పంపకాలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో సీఎం సీటు మార్పు ఖాయంగా కనిపిస్తుండడంతో ఎవరెవరికి ఏ పదవి కేటాయిస్తారా అని ఆసక్తిగా మారింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌‌ కూడా ఎవరికి ఏ పదవి అప్పజెప్పాల్నో ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

సీఎం మార్పులో భాగంగా కేటీఆర్‌‌కు సీఎం పదవి అని ఇప్పటికే ఖరారైంది. మరి కేసీఆర్‌‌ తనయ కవిత పరిస్థితి ఏంటి..? తండ్రి కేసీఆర్‌‌ ఆమెకు ఏ పదవిని అప్పజెప్పబోతున్నాడు..? అంటే కవితకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఖరారైనట్లు సమాచారం అందుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికలయ్యాక కవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆమె కార్మిక సంఘాలను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. టీఆర్ఎస్ గెలుపులో కార్మిక సంఘాలదీ కీలక పాత్రనే.

ఉద్యమ సమ‌యంలోనూ ఉద్యోగుల నుంచి కుల సంఘాల వ‌ర‌కు అన్నింటినీ ఏర్పాటు చేయడంలో టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించింది. వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల‌కు ఆ పార్టీ నేత‌లే గౌర‌వాధ్యక్షులుగా ఉండేవారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వైఖ‌రిని పూర్తిగా మార్చుకుంది. కొన్ని సంఘాల నుంచి వ‌చ్చిన త‌ల‌నొప్పుల‌తో ఆయా సంఘాల‌కు గౌర‌వాధ్యక్ష ప‌ద‌వుల నుంచి టీఆర్ఎస్ నేత‌లు త‌ప్పుకోవాల‌ని కేసీఆర్ ఆదేశించారు. అలా ఆర్టీసీ కార్మిక సంఘం నుంచి హరీష్ రావు, సింగ‌రేణి కార్మిక సంఘం నుంచి కవిత కూడా వైదొలిగారు. మిగతా నేతలు కూడా వైదొలిగారు. దీంతో ఉద్యోగ, కార్మిక సంఘాల్లో టీఆర్ఎస్ పట్టు తగ్గింది.

ఇక దుబ్బాక.. జీహెచ్‌ఎంసీ ఫలితాలు ఇప్పుడు గులాబీ పార్టీని గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో దూర‌మైన సంఘాల‌ను వ‌ర్గాల‌ను చేర‌దీసే ప‌నిలో ప‌డ్డారు. ఆ బాధ్యత కవితకు అప్పగించారు. ఇటీవ‌ల క‌విత విస్తృతంగా పర్యటిస్తున్నారు. కవితను పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ చేసి ఆ త‌ర్వాత కీల‌క ప‌ద‌వులు అప్పగించేందుకు నిర్ణయించారని ఈ కారణంగానే అనుకుంటున్నారు. కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అయితే.. కేటీఆర్ సీఎం అయితే అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఇక టీఆర్‌‌ఎస్‌ పార్టీ పూర్తిగా కవిత చేతుల్లోకి వెళ్లినట్లే.