https://oktelugu.com/

Yuzvendra Chahal: చాహల్ – ధనశ్రీ ఇంకా విడాకులు తీసుకోలేదట.. ఇచ్చే భరణం 60 కోట్లు కాదట!

Yuzvendra Chahal టీమిండియా స్టార్ క్రికెటర్ యాజువేంద్ర చాహల్ తన భార్యతో దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టు గత కొంతకాలంగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసినట్టు వార్తలు వచ్చాయి..

Written By: , Updated On : March 19, 2025 / 03:44 PM IST
Yuzvendra Chahal (1)

Yuzvendra Chahal (1)

Follow us on

Yuzvendra Chahal: విడాకులు మంజూరు చేయడాని కంటే ముందు చాహల్ – ధనశ్రీ బాంద్రా ఫ్యామిలీ కోర్టు 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిందని.. ఎంతసేపటికి వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి ఆసక్తి చూపించాలని స్పోర్ట్స్, బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చాహల్ – ధనశ్రీకి ఇంకా విడాకులు మంజూరు కాలేదని.. ఈ ప్రక్రియ రేపటితో ముగుస్తుందని తెలుస్తోంది. చాహల్ – ధనశ్రీ విడాకుల పిటిషన్ పై గురువారంలోగా తీర్పు ఇవ్వాలని బాంద్రా ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆశ్రయించింది.. కూలింగ్ ఆఫ్ వ్యవధిని మినయించాలనే విషయంపై వచ్చిన పిటిషన్ ను బాంద్రా ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. ఆ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది.. చాహల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో గురువారంలోగా తీర్పు ఇవ్వాలని బాంబే హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.. ” బాంద్రా ఫ్యామిలీ కోర్టు చాహల్ – ధనశ్రీ విడాకుల పిటిషన్ పై రేపటి లోగా తీర్పు ఇవ్వాలి. కూలింగ్ ఆఫ్ వ్యవధిని పక్కన పెట్టాలి.. చాహల్ ఐపీఎల్ లో ఆడాల్సి ఉంది కాబట్టి రేపటిలోగా తీర్పు ఇవ్వాలని” హైకోర్టు బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.

Also Read: సునీతా విలియమ్స్ ను కలిశాం.. దాన్నే వాషింగ్టన్ మూమెంట్ అంటారేమో…

2020లో వివాహం

చాహల్ – ధనశ్రీ 2020లో పెళ్లి చేసుకున్నారు. 2023 వరకు వీరిద్దరూ బాగానే ఉన్నారు. 2024 మధ్యలో నుంచే వీరిద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయాయి. దీంతో ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేశారు. ఎవరిదారి వారు అన్నట్టుగా ఉంటున్నారు. ఇక ఇటీవల చాహల్ ఆర్జే మహ్వేష్ తో కలిసి కనిపించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా – న్యూజిలాండ్ జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడాయి. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు చాహల్ ఆర్జే మహ్వేష్ తో కలిసి వచ్చాడు. వారిద్దరూ అక్కడ మ్యాచ్ చూసి ఆస్వాదించారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చోవడం.. అత్యంత సన్నిహితంగా కనిపించడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని పుకార్లు వినిపించాయి. ఆ మరసటి రోజు ఆర్జే మహ్వేష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ఎవరి పని వారు చేసుకుంటే మంచిదనే అని అర్థం వచ్చేలా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..ఇక ధనశ్రీకి చాహల్ ఆమధ్య విడాకుల భరణంగా 60 కోట్ల దాకా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే అదంతా నిజం కాదని.. భరణం గా చాహల్ 4.75 కోట్లు చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేశాడని.. రేపు విడాకుల విషయంలో తీర్పురాగానే ధనశ్రీ డబ్బులు చెల్లిస్తాడని తెలుస్తోంది.