Tuk Tuk Trailer Review: పలు సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి, ‘కోర్ట్'(Court Movie) చిత్రం తో హీరో గా మారిన రోషన్(Harsh Roshan), మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ముందుకు దూసుకుపోతుంది. కేవలం 5 రోజుల్లోనే 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే సినిమాగా నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది ఇలా ఉండగా రోషన్ హీరో గా నటించిన మరో సినిమా ‘టుక్ టుక్'(Tuk Tuk Trailer) కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు మేకర్స్. శాన్వీ మేఘన అనే కొత్త అమ్మాయి ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం కానుంది.
Also Read: యాంకర్ శ్యామల అరెస్ట్ కి లైన్ క్లియర్..? అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందిగా!
ఈ ట్రైలర్ ని చూస్తుంటే రోషన్ మళ్ళీ కొత్త తరహా కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నాడని అర్థం అవుతుంది. అన్ని రెగ్యులర్ సినిమాలు లాగానే ఇందులో హీరో తన స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. మధ్యలో అతనికి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలో కొత్తదనం ఏమిటంటే, హీరో వాడే బైక్ లో దెయ్యం ఉండడమే. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?, హీరో స్కూటర్ లోనే ఆ దెయ్యం ఎందుకు దూరాల్సి వచ్చింది. దాని వెనుక ఫ్లాష్ బ్యాక్ ఏమిటి?, హీరోయిన్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయి, హీరో ని వదలలేక ఆ బైక్ లోనే ఉండిపోయిందా?, లేదా వేరే ఫ్లాష్ బ్యాక్ ఏదైనా ఉందా అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. రోషన్ ని చూస్తుంటే ఎదో రెండు మూడు సినిమాలకు పరిమితమయ్యే హీరో లాగా లేదు.
స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. ఇలాగే అతను సినిమాలు చేసుకుంటూ పోతే కచ్చితంగా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో గా మారొచ్చు. మరో విశేషం ఏమిటంటే కోర్ట్ చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతుండగానే, రోషన్ నటించిన ఈ చిత్రం ఈ నెల 21 న విడుదల కాబోతుంది. తన సినిమాకు తన సినిమానే పోటీ అన్నమాట. అదృష్టం కలిసొచ్చి ఈ సినిమా కూడా హిట్ అయితే ఈ కుర్రాడి లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఈ ట్రైలర్ ని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో వ్యక్తం చేయండి.
