Purandeshwari-Jr.NTR
Purandeshwari : నందమూరి కుటుంబం( Nandamuri family) పై గాసిప్స్ నడుస్తుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా ప్రచారం నడుస్తూ ఉంటుంది. అయితే దానిపై స్పందించారు ఎన్టీఆర్ కుమార్తె, బిజెపి రాష్ట్ర చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెట్టిందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణకు, ఎన్టీఆర్ కు మధ్య దూరం బాగా పెరిగిందని.. జూనియర్ ఎన్టీఆర్ తో ఉండడం వల్ల కళ్యాణ్ రామ్ ను సైతం బాలకృష్ణ పక్కన పెట్టారని వార్తలు గుప్పుమన్నాయి. నందమూరి కుటుంబమంతా ఒకవైపు.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకవైపు అన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇటువంటి సమయంలోనే పురందేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యానించారు.
Also Read : పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్షన్ వైరల్!
* బాలకృష్ణతో విభేదాలు
బాలకృష్ణ ( Nandamuri Balakrishna )దూకుడుగా ఉన్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మరోవైపు అన్ స్టాపబుల్ అంటూ సందడి చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలంతా వచ్చారు. కానీ నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం రాలేదు. దీంతో ఆ కుటుంబంలో విభేదాలు చర్చకు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పురందేశ్వరి మాట్లాడారు. నందమూరి కుటుంబంలో విభేదాలు లేవని అర్థం వచ్చేలా మాట్లాడారు. అసలు ఆ పరిస్థితి లేదన్నట్టు సంకేతాలు ఇచ్చారు. దీంతో నందమూరి కుటుంబం చుట్టూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది.
* తాను అంటే ఇష్టం..
ఓ మీడియా ఇంటర్వ్యూలో పురందేశ్వరి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ తో( Junior NTR) మీ అనుబంధం ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకు.. అత్తగా తనను తారక్ ఎంతో గౌరవిస్తాడని.. పెద్దలంటే చాలా గౌరవమని.. తనంటే బాగా ఇష్టమని చెప్పారు. అంతేకాకుండా పిల్లలందరితో ప్రతిరోజు టచ్ లో ఉంటామని.. ప్రతిరోజు ఫోన్ చేస్తుంటామని.. వీడియో కాల్స్ కూడా చేసుకుని మాట్లాడుకుంటామని వివరించారు. సినిమాలకు సంబంధించి తాను తారక్, కళ్యాణ్ రామ్ లకు ఎటువంటి సలహాలు ఇవ్వనని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
* విభేదాలు ముగిసినట్టే..
బాలకృష్ణతో ఆ ఇద్దరూ యువ హీరోలకు గ్యాప్ భారీగా పెరిగిందని.. కోల్డ్ వార్ ( cold war) నడుస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలతో అటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. కొద్దిరోజుల కిందట బాలకృష్ణకు పద్మ అవార్డు ప్రకటించారు. ఆ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. బాలా బాబాయ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో సైతం కళ్యాణ్ రామ్ బాబాయి ప్రస్తావన తీసుకొచ్చారు. మొత్తానికైతే నందమూరి కుటుంబంలో కోల్డ్ వార్ క్లైమాక్స్ కు చేరుకున్నట్టేనని తేలిపోయింది.
Also Read : విద్యార్థుల ఫోన్లకు పరీక్షా ఫలితాలు.. లోకేష్ సంచలన ప్రకటన